Home > తెలంగాణ > అలర్ట్... రాష్ట్రంలో నేడు స్కూళ్లు, కాలేజీలు బంద్.

అలర్ట్... రాష్ట్రంలో నేడు స్కూళ్లు, కాలేజీలు బంద్.

విద్యారంగ సమస్యల పరిష్కారానికై..

అలర్ట్... రాష్ట్రంలో నేడు స్కూళ్లు, కాలేజీలు బంద్.
X


రాష్ట్రంలో విద్యారంగ సమస్యల పరిష్కరించకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని నిరసిస్తూ వామపక్ష విద్యార్థి సంఘాలు నేడు విద్యాసంస్థల బంద్ కు పిలుపునిచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా నేడు పాఠశాలలు, జూనియర్ కాలేజీలు బంద్ కానున్నాయి. ఈ బంద్ కు తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోషియేషన్ మద్ధతు తెలిపింది. ప్రైవేట్ స్కూళ్లు విద్యార్థుల నుంచి అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నాయని.. ప్రభుత్వం వాటి నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విద్యార్థి సంఘాలు పేర్కొంటున్నాయి. అలానే విద్యారంగలోని వివిధ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ బంద్ లకు పిలుపునిస్తున్నాయి. విద్యా రంగంలో సమస్యలపై ఇటీవల భేటీ అయిన మంత్రివర్గ సబ్ కమిటీ సైతం తూతూ మంత్రంగానే సాగింది తప్పా.. ఎలాంటి చర్యలు లేవని మండిపడ్డాయి. ఫీజుల నియంత్రణకు కేబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్, తిరుపతిరావు కమిటీ నివేదికలు బహిర్గతం చేయకపోవడం సర్కారు సైతం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తోందన్నారు.




విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు కావొస్తున్నా.. విద్యార్థులందరికీ యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు అందలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కొన్ని చోట్ల చదువులు చెప్పే టీచర్లు లేక.. మరికొన్ని చోట్ల మౌళిక సదుపాయాలు లేవని పేర్కొంటున్నారు. తాగునీరు, మరుగుదొడ్లు లేవని… మధ్యాహ్న భోజనం బిల్లుల పెండింగ్ వంటి సమస్యలు కుప్పలు తెప్పలుగా ఉన్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని.. అందుకే బంద్ కు పిలుపునిచ్చినట్లు వామపక్ష విద్యార్థి సంఘాలు AISF, SFI, AIDSU, PDSU తెలిపాయి.



Updated : 12 July 2023 2:09 AM GMT
Tags:    
author-thhumb

Veerendra Prasad

వీరేందర్ మైక్ టీవీ వెబ్‌సైట్ లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌(సబ్ ఎడిటర్)గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 6 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో(V6, T News) రాజకీయం, లైఫ్ స్టైల్, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.


Next Story
Share it
Top