Home > తెలంగాణ > అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంలో..ఆంధ్రోళ్లకు ఏం పని..?: గుత్తా సుఖేందర్ రెడ్డి

అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంలో..ఆంధ్రోళ్లకు ఏం పని..?: గుత్తా సుఖేందర్ రెడ్డి

అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంలో..ఆంధ్రోళ్లకు ఏం పని..?: గుత్తా సుఖేందర్ రెడ్డి
X

కాంగ్రెస్ నేత బత్తుల లక్ష్మారెడ్డి (బీఎల్ఆర్)పై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అసహన వ్యాఖ్యలు చేశారు. అడవిదేవులపల్లి మండల కేంద్రంలో అసైన్డ్ భూముల పట్టా పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో గుత్తా మాట్లాడుతూ.. బువ్వ పెట్టి.. పదవి గుంజుకోవాలని బీఎల్ఆర్ అనుకుంటున్నారని విమర్శించారు. దేశానికి అన్నం పెట్టే స్థితిలో ఉన్న నియోజకవర్గం మనదన్నారు. మన ఇంట్లో మనిషి పోతే తిండి కోసం పరాయి వాళ్లకు ఫోన్లు చేయడం ఏం ఖర్మ అని విమర్శించారు. ఇక్కడ పెత్తనం చేయడానికి బీఎల్ఆర్ ఎవరంటూ అసహనం వ్యక్తం చేశారు. అభివృద్ధి చెందుతున్న తెలంగాణలో ఆంధ్రా వాళ్లకు ఏం పని అని ప్రశ్నించారు. గత చరిత్రను పునరావృతం చెయ్యడానికి.. దోచుకునేందుకే బీఎల్ఆర్, షర్మిల, కేవీపీలు తెలంగాణలో అడుగు పెడుతున్నారన్నారు. ఆంధ్రా వాళ్లకు తగిన బుద్ధి చెప్పాలని..ఓట్లతో తరిమికొట్టండి అంటూ పిలుపునిచ్చారు.

మంగళవారం ఓ సందర్భంలో మీడియాతో మాట్లాడిన గుత్తా.. కేంద్రంలోని బీజేపీ సర్కార్‌, కాంగ్రెస్‌ పార్టీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఉద్యమంలో అస్సలు బీజేపీ పాత్ర లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలను మభ్యపెట్టేలా కాంగ్రెస్ ఆరు గ్యారంటీ స్కీమ్స్ తీసుకొచ్చింది. ఆచరణకాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయొద్దు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ స్కీమ్స్ ఎందుకు అమలు చేయడం లేదు అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమం సమయంలో కిషన్ రెడ్డి తెలంగాణ కోసం ఎందుకు రాజీనామా చేయలేదు. తెలంగాణ ఉద్యమంలో బీజేపీ పాత్ర లేదు. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను కప్పిపుచ్చుకునేందుకే మహిళా రిజర్వేషన్ బిల్లు తెస్తున్నారు అంటూ ఘాటు విమర్శలు చేశారు.




Updated : 20 Sept 2023 11:58 AM IST
Tags:    
Next Story
Share it
Top