Home > తెలంగాణ > వచ్చే నెలలోనూ తెలంగాణలో వానలు డౌటే.. కానీ ఏపీలో మాత్రం..

వచ్చే నెలలోనూ తెలంగాణలో వానలు డౌటే.. కానీ ఏపీలో మాత్రం..

వచ్చే నెలలోనూ తెలంగాణలో వానలు డౌటే.. కానీ ఏపీలో మాత్రం..
X

తెలంగాణలో వర్షాలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. జులై దంచికొట్టిన వానలు అగస్ట్లో పత్తాలేకుండా పోయాయి. అగస్టులో అడపాదడపా వానలు మాత్రమే పడ్డాయి. 1972 తర్వాత ఆగస్టు నెలలో రాష్ట్రంలో ఈసారే అత్యల్పంగా వర్షపాతం నమోదైంది. ఈ నెలలో కేవలం 74.4 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. ఇది సాధారణం కంటే 60 శాతం తక్కువ కావడం గమనార్హం. కనీసం సెప్టెంబర్ లోనైనా ఎక్కువ వర్షాలు పడతాయనుకుంటున్న రైతులకు వాతావరణ శాఖ చేదువార్త తెలిపింది.

సెప్టెంబర్లోనూ ఆశించిన స్థాయిలో వర్షాలు పడడం డౌటేనని వాతావరణ శాఖ చెప్పింది. ఎల్‌నినో ప్రభావం కారణంగా సెప్టెంబర్‌లోనూ వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం లేదని తెలిపింది.

దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఈ ఏడాది రుతుపవనాలు అత్యంత బలహీనంగా మారినట్లు చెప్పింది. ఈ ఏడాది జూన్‌లో లోటు వర్షాపాతం ఏర్పడింది. ఆ తర్వాత రుతుపవనాలు చురుగ్గా కదలడంతో దేశవ్యాప్తంగా భారీ వర్షాపాతం నమోదైంది. ఇటు తెలంగాణలోనూ జులైలో వానలు దంచికొట్టాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఓ ఊరే మునిగిపోయింది.

ఏపీలో మాత్రం పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది. వచ్చే నెల ఆరంభం నుంచే విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. హిమాలయాలకు వెళ్లిన రుతుపవన ద్రోణి సెప్టెంబర్ 1 తర్వాత..దక్షిణాదికి తిరిగి వస్తాయని అంచనా వేసింది. ఆ తర్వాత ఏపీలో జోరుగా వానలు పడుతాయని వివరించింది. దీంతో అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Updated : 29 Aug 2023 3:35 PM IST
Tags:    
Next Story
Share it
Top