Home > తెలంగాణ > అసెంబ్లీ ఎన్నికల్లో 70.79 ఓటింగ్.. కౌంటింగ్కు ముమ్మరంగా ఏర్పాట్లు..

అసెంబ్లీ ఎన్నికల్లో 70.79 ఓటింగ్.. కౌంటింగ్కు ముమ్మరంగా ఏర్పాట్లు..

అసెంబ్లీ ఎన్నికల్లో 70.79 ఓటింగ్.. కౌంటింగ్కు ముమ్మరంగా ఏర్పాట్లు..
X

అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి పోలింగ్ శాతం తగ్గిందని రాష్ర్ట ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌ రాజ్‌ అన్నారు. 2018లో 73.37శాతం ఓటింగ్ నమోదుకాగా.. ఈసారి అది 70.79 మాత్రమేనని స్పష్టం చేశారు. యాదాద్రి జిల్లాలో అత్యధికంగా 90.3శాతం ఓటింగ్ జరగగా.. హైదరాబాద్ లో అత్యల్పంగా 46.56శాతం మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారని చెప్పారు. 79 నియోజకవర్గాల్లో 75 శాతానికిపైగా పోలింగ్ జరిగినట్లు వికాస్ రాజ్ చెప్పారు.

డిసెంబర్ 3న జరనున్న ఓట్ల లెక్కింపు కోసం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నామని వికాస్ రాజ్ అన్నారు. 49 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతుందని చెప్పారు. ఆదివారం ఉ. 8 గంటలకు పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు మొదలవుతుందని, ఉ. 8.30 గంటలకు ఈవీఎం ఓట్ల కౌంటింగ్ మొదలవుతుందని అన్నారు. ఓట్‌ ఫ్రం హోమ్‌ మంచి ఫలితాలు ఇచ్చిందన్న వికాస్‌ రాజ్‌.. ఎన్నికల కోసం 2 లక్షల కన్నా ఎక్కువ మంది సిబ్బంది కష్టపడ్డారని చెప్పారు. స్వల్ప ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని.. రీ పోలింగ్‌కు అవకాశం లేదని స్పష్టం చేశారు.


Updated : 1 Dec 2023 3:34 PM IST
Tags:    
Next Story
Share it
Top