తెలంగాణలో మోస్తరు వర్షాలు..వాతావరణ శాఖ అలర్ట్
X
తెలంగాణలో రానున్న రెండు రోజులు తెలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురవవచ్చునని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈరోజు ఆదిలాబాద్ లోని కొన్ని ప్రాంతాలు, కొమురంబీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి తదితర జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురవవచ్చునని... గంటకు 30 కిలో మీటర్ల నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.
రేపు ఆదిలాబాద్‌లోని పలు ప్రాంతాలతో పాటు కొమురంబీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది.వడగాళ్ల వర్షం రైతులకు తీరాన్ని శొకాన్ని మిగులుస్తోంది. మరో వైపు కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన ఉందని వెదర్ డిపార్ట్మెంట్ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అకాల వర్షాల నేపథ్యంలో అన్నదాతలు ఆందోళన చెందుతుంటే వడగాలుల నుంచి ప్రజలు ఉపశమనం పొందుతున్నారు.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.