Home > తెలంగాణ > అపార్ట్మెంట్పై పిడుగుపాటు.. కాలిపోయిన ఎలక్ట్రిక్ సామాగ్రి

అపార్ట్మెంట్పై పిడుగుపాటు.. కాలిపోయిన ఎలక్ట్రిక్ సామాగ్రి

అపార్ట్మెంట్పై పిడుగుపాటు.. కాలిపోయిన ఎలక్ట్రిక్ సామాగ్రి
X

హైదరాబాద్పై వరుణుడు ప్రకోపం కొనసాగుతూనే ఉంది. సోమవారం రాత్రి భారీ వర్షం పడింది. ఈ క్రమంలో అత్తాపూర్ లోని వాసుదేవ నగర్లో ప్రమాదం జరిగింది. హన్స్ రాజ్ ఎంక్లేవ్ అపార్ట్మెంట్ పై భారీ శబ్దంతో పిడుగుపడింది. అపార్ట్ మెంట్లో 40 ఫ్లాట్లు ఉండగా.. పిడుగుపాటుకు ఇండ్లలోని లైట్లు, ఫ్యాన్లు, ఫ్రిడ్జులు కాలిపోయాయి. దీంతో అపార్ట్మెంట్ వాసులు భయంతో బయటకు పరుగులు తీశారు. అదృష్టవశాత్తు ప్రాణ నష్టం తప్పింది. పలు ఫ్లాట్లలోని కరెంటు వైరింగ్ కాలిపోయింది. రాత్రంతా కరెంటు లేకపోవడంతో అపార్ట్మెంట్ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Updated : 25 July 2023 10:27 AM IST
Tags:    
Next Story
Share it
Top