Home > తెలంగాణ > తెలంగాణలో 3 రోజులు మద్యం షాపులు బంద్

తెలంగాణలో 3 రోజులు మద్యం షాపులు బంద్

తెలంగాణలో 3 రోజులు మద్యం షాపులు బంద్
X

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 28 సాయంత్రం 5 గంటల నుంచి 30వ తేదీ సాయంత్రం 5గంటల వరకు రాష్ట్రంలోని అన్ని వైన్ షాపులు మూసివేయాలని ఆదేశించింది. మద్యంషాపులతో పాటు బార్లు, బార్ అండ్ రెస్టారెంట్లు బంద్ చేయాలని ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈసీ ఆదేశాలను ఉల్లంఘించి వైన్ షాపులు తెలిచినా, అక్రమంగా మద్యం రవాణా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎలక్షన్ కమిషన్ హెచ్చరించింది. అక్రమ మద్యం రవాణాపై నిఘా పెట్టాలని ఎక్సైజ్ అధికారులను ఆదేశించింది.

ఎలక్షన్ కమిషన్ ఆదేశాలతో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు ఆయా కమిషనరేట్ల పరిధిలోని వైన్ షాపులు బంద్ చేసేలా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో నవంబర్ 28 సాయంత్రం 5గంటల నుంచి 30వ తేదీ సాయంత్రం 5గంటల వరకు మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. మరోవైపు

ఓట్ల లెక్కింపు నేపథ్యంలో డిసెంబర్ 3 ఉదయం 6 గంటల నుంచి లెక్కింపు పూర్తయ్యే వరకూ ట్రై కమిషనరేట్ల పరిధిలో మద్యం దుకాణాలు, బార్లను మూసివేయనున్నారు.

Updated : 26 Nov 2023 6:31 PM IST
Tags:    
Next Story
Share it
Top