Home > తెలంగాణ > Lok Sabha Elections : లోక్ సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్, బీఎస్పీ పొత్తు ఖరారు

Lok Sabha Elections : లోక్ సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్, బీఎస్పీ పొత్తు ఖరారు

Lok Sabha Elections  : లోక్ సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్, బీఎస్పీ పొత్తు ఖరారు
X

లోక్ సభ ఎన్నికల వేళ కొత్త పొత్తు పొడిచింది. బీఆర్‌ఎస్‌తో కలిసి వెళ్లాలని బీఎస్పీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. ఎంపీ ఎన్నికల్లో తాము బీఆర్‌ఎస్ కలిసి పోటీ చేస్తామని ఆ పార్టీ ప్రకటించింది. త్వరలో విధివిధానాలు ఖరారు కానున్నాయి. ఇప్పటికే దీనిపై బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కూమార్ చర్చలు జరిపారు. త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ – బీఎస్పీ పార్టీల మ‌ధ్య పొత్తు కుదిరింది. రాష్ట్రంలోని 17 నియోజ‌క‌వ‌ర్గాల్లో బీఆర్ఎస్‌తో క‌లిసి పోటీ చేయాల‌ని బీఎస్పీ రాష్ట్ర అధ్య‌క్షుడు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ నిర్ణ‌యించారు. పొత్తు అంశంపై బీఎస్పీ రాష్ట్ర అధ్య‌క్షుడితో కేసీఆర్ నిర్ణ‌యించారు. బీఆర్ఎస్ మద్దతుతో ప్రవీణ్ కుమార్ నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారని చర్చ మొదలైంది. ఇవాళ మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానాల అభ్యర్థులపై కేసీఆర్ ఆ పార్టీ నేతలతో చర్చలు జరిపారు.





ఈ నేపథ్యంలో ప్రవీణ్ కుమార్ కు మద్దతిచ్చేందుకు కేసీఆర్ అంగీకరించినట్లు తెలుస్తోంది. పార్లమెంటు ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ కావడం చర్చకు దారితీసింది. పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ భేటీ జరిగినట్లు సమాచారం. ఇవాళ నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్ నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపికకు సంబంధించి తెలంగాణ భవన్ లో సమీక్ష సమావేశం జరిగింది. అదే సమయంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ తో భేటీ కావడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ రెండు పార్టీలు కూడా భావ్యసారూప్యతో ముందుకెళ్లే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ కాగజ్ నగర్ పోటీ చేసినా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గెలవలేకపోయారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఆలంపూర్ నియోజకవర్గం ప్రవీణ్ కుమార్ సొంత నియోజకవర్గం.




Updated : 5 March 2024 4:28 PM IST
Tags:    
Next Story
Share it
Top