Home > తెలంగాణ > Former MLA Shakeel : మాజీ ఎమ్మెల్యే షకీల్‌‌కు హైకోర్టులో ఊరట.. లుకౌట్ నోటీసులు సస్పెండ్

Former MLA Shakeel : మాజీ ఎమ్మెల్యే షకీల్‌‌కు హైకోర్టులో ఊరట.. లుకౌట్ నోటీసులు సస్పెండ్

Former MLA Shakeel : మాజీ ఎమ్మెల్యే షకీల్‌‌కు హైకోర్టులో ఊరట.. లుకౌట్ నోటీసులు సస్పెండ్
X

బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. కూమారుడి కారు ప్రమాద కేసులో అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. షకీల్‌పై లుకౌట్ నోటీసులను సస్పెండ్ చేసింది. ఈ నెల 23 పోలీసుల ముందు హాజరుకావాలని కోర్టు తెలిపింది. . విచారణను ఈ నెల 23న షకీల్ పోలీసుల ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. కొన్ని రోజుల క్రితం బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు కారు వేగంగా నడుపుతూ ప్రజాభవన్ ఎదుట ఉన్న బారీ కేడ్లను ఢీకొట్టడంతో, షకీల్‌ కుమారుడు సాహిల్‌తోపాటు స్నేహితులపై పోలీసులు కేసు నమోదు నమోదైన విషయం తెలిసిందే.





ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న రాహిల్ ని తప్పించి దుబాయ్ పంపించాడనే ఆరోపణలతో షకీల్ పేరును కూడా చేర్చారు. దీనిపై షకీల్ హైకోర్టును ఆశ్రయించాడు. దర్యాప్తు కేసులో భాగంగా జారీ చేసిన లుక్‌ అవుట్‌ సర్క్యులర్లను సవాలు చేస్తూ మాజీ ఎమ్మెల్యే షకీల్‌, సయ్యద్‌ సాహెద్‌ రహమాన్‌, మహమ్మద్‌ ఖలీల్‌ హైకోర్టులో శుక్రవారం రోజున అత్యవసరంగా పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ విచారణ చేపట్టి ఈ కేసుపై పోలీసులు ఎందుకు అంత వేగంగా దర్యాప్తు చేస్తున్నారో తెలియడం లేదని, అదే సామాన్యులైతే ఇలానే చేస్తారా అంటూ వ్యాఖ్యానించారు. ఏడేళ్లలోపు శిక్ష పడే కేసుల్లో సీఆర్‌పీసీ 41ఏ కింద నోటీసులు జారీ చేసి విచారణ చేపట్టాల్సి ఉండగా అరెస్ట్‌లు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. వాదనలను విన్న న్యాయమూర్తి పిటిషనర్లకు వ్యతిరేకంగా జారీ చేసిన ఎల్‌ఓసీని సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.




Updated : 10 Feb 2024 2:26 AM GMT
Tags:    
Next Story
Share it
Top