Home > తెలంగాణ > పోలీస్​స్టేషన్​లోనే లవర్స్​పై దాడి.. రోడ్డుపై పరుగులు

పోలీస్​స్టేషన్​లోనే లవర్స్​పై దాడి.. రోడ్డుపై పరుగులు

పోలీస్​స్టేషన్​లోనే లవర్స్​పై దాడి.. రోడ్డుపై పరుగులు
X

ఆమెకు 22, అతనికి 25. గత కొంతకాలంగా ప్రేమ లోకంలో విహరించిన వారిద్దరూ.. పెద్దలను ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నారు. అయితే మేజర్లైన తమకు తల్లిదండ్రుల నుంచి ప్రాణహాని ఉందని స్థానిక పోలీస్​స్టేషన్​ను ఆశ్రయించారు. జోగులాంబ గద్వాల్​ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఈ క్రమంలో స్టేషన్​ వద్ద ఉన్న ప్రేమ జంటపై తల్లిదండ్రులు, వారి బంధువులు దాడి చేశారు. దీంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రేమ జంట రోడ్డుపై పరుగులు తీశారు.

బాధితుల కథనం ప్రకారం.. జోగులాంబ గద్వాల్​ జిల్లా గద్వాల్​ మండలం పూడూరు గ్రామానికి చెందిన శిరీష(22), గద్వాల్​ పట్టణానికి చెందిన చెందిన ప్రశాంత్ (25) ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో సోమవారం ఏపీలోని కర్నూల్ జిల్లా ఓర్వకల్లులో పెళ్లి చేసుకున్నారు. అమ్మాయి తల్లిదండ్రుల నుంచి తమకు ప్రాణహాని ఉందని గద్వాల రూరల్ పోలీస్​స్టేషన్​ను ఆశ్రయించారు. ఈ క్రమంలో స్టేషన్​వద్దకు చేరుకున్న తల్లిదండ్రులు, బంధువులు ప్రేమజంటతో గొడవకు దిగి స్టేషన్​లోనే ఇరువురిపై దాడి చేశారు. దీంతో వారు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని రోడ్డుపై పరుగులు తీస్తూ ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. తమకు న్యాయం చేయాలని పోలీసులను కోరారు.

Updated : 12 July 2023 9:48 AM IST
Tags:    
Next Story
Share it
Top