Home > తెలంగాణ > బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. మళ్లీ రానున్నై వర్షపు రోజులు

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. మళ్లీ రానున్నై వర్షపు రోజులు

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. మళ్లీ రానున్నై వర్షపు రోజులు
X

పోయిన వారమంతా తెలుగు రాష్ట్రాలు అల్లకల్లోలంగా మారాయి. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలతో వాగులు, చెరువులు, నదులు పొంగి పొర్లి.. ఊళ్లన్నీ జలమయం అయ్యాయి. చాలామంది ప్రాణాలు కోల్పోయారు. జన జీవనం స్థంభించి పోయింది. అయితే, గత మూడు రోజులుగా వర్షాలు నుంచి కాస్త ఉపశమనం లభించింది. వర్షాలు తగ్గుముఖం పట్టి అంతా సర్దుకుంటుంది అనుకునేలోపే.. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఉత్తర ఒడిశా, పశ్చిమబెంగాల్ తీరంలోని వాయువ్య బంగాళాఖాతంలో సోమవారం (జులై 31) ఏర్పడిన అల్పపీడనం బలపడింది. ప్రస్తుతం ఉత్తర బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం రాగల 12 గంటల్లో వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

దీంతో పశ్చిమ దిశ నుంచి తెలంగాణకు బలమైన గాలులు వీస్తున్నాయి. అంతేకాకుండా ఆదివారం నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తేలక నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందపి వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నందున రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీ చేశారు.


Updated : 31 July 2023 12:37 PM GMT
Tags:    
Next Story
Share it
Top