Home > తెలంగాణ > జనాలను ఇబ్బంది పెడితే ఊరుకోం.. ఐటీ ఎంప్లాయిస్కు డీసీపీ వార్నింగ్..

జనాలను ఇబ్బంది పెడితే ఊరుకోం.. ఐటీ ఎంప్లాయిస్కు డీసీపీ వార్నింగ్..

జనాలను ఇబ్బంది పెడితే ఊరుకోం.. ఐటీ ఎంప్లాయిస్కు డీసీపీ వార్నింగ్..
X

చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. అయితే బాబుకు మద్దతుగా నిరసన చేపట్టిన ఉద్యోగులకు తెలంగాణ పోలీసులు షాకిచ్చారు. ఆందోళనలపై ఆంక్షలు విధించారు. మాదాపూర్, గచ్చిబౌలి, మణికొండ, నానక్‌రాంగూడలో ఆందోళనలు, నిరసనలపై ఆంక్షలు విధిస్తూ మాదాపూర్ డీసీపీ సందీప్​ ఉత్తర్వులు జారీ చేశారు.

చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఐటీ ఉద్యోగులు 3 రోజులుగా నిరసన తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ కూడా ఆందోళనలకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో వీరికి షాకిస్తూ మాదాపూర్ డీసీపీ ఇలాంటి ఆందోళనలకు పోలీస్ పర్మిషన్ లేదని అన్నారు. అనుమతి లేకుండా ఎవరైనా నిరసన చేస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. ధర్నాలతో సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని, ఐటీ ఉద్యోగుల కంపెనీలకు సైతం నోటీసులు పంపుతామని డీసీపీ సందీప్ హెచ్చరించారు.

శనివారం చంద్రబాబుకు మద్దతుగా టీడీపీ నేతలు ఐటీ ఎంప్లాయిస్ తో కలిసి ఓఆర్ఆర్పై మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 5గంటల వరకు కారు ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. నానక్ రాం గూడ టోల్ గేట్ ఎంట్రీ నుంచి ఓఆర్ఆర్ పైకి చేరుకుని 60కిలోమీటర్ల స్పీడ్ తో ప్రదర్శన నిర్వహించి తిరిగి నానక్ రాం గూడకు చేరుకోవాలని డిసైడ్ అయ్యారు. దీంతో పాటు సాయంత్రం 6గంటల సమయంలో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోని ట్రిపుల్ ఐటీ జంక్షన్ వద్ద నిరసన ప్రదర్శన చేపట్టేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ రెండు ఈవెంట్లకు పోలీస్ పర్మిషన్ లేదని డీసీపీ సందీప్ స్పష్టం చేశారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించినా, దీనికి సంబంధించిన సమాచారం సోషల్ మీడియాలో ప్రచారం చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.

డీసీపీ నిర్ణయాన్ని పలువురు నెటిజన్లు సమర్థిస్తున్నారు. గొప్ప నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకులు అరెస్టైతే ఇక్కడి సామాన్య ప్రజలు ఎందుకు ఇబ్బందులు పడాలని ఆందోళనకు పిలుపునిచ్చిన ఐటీ ఉద్యోగులను ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఆందోళన చేయాలనుకుంటున్న ఐటీ ఎంప్లాయిస్ అమరావతి వెళ్లి చేసుకోవాలని మరికొందరు సూచించారు. కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వెళ్లలేక, ఒక రోజు శాలరీ కట్ అవుతుందన్న భయంతో ఇక్కడ నిరసనలు చేస్తున్నారా అని ప్రశ్నించారు. ఏపీలో సమస్యకు తెలంగాణలో ట్రాఫిక్ జాం చేసి జనాన్ని ఇబ్బందిపెడితే పరిష్కారం ఎలా లభిస్తుందని నిలదీస్తున్నారు.




Updated : 15 Sep 2023 3:25 PM GMT
Tags:    
Next Story
Share it
Top