Home > తెలంగాణ > రాష్ట్రం ఏర్పడకముందు ‘జనం మనం’.. ఇప్పుడు ‘ధనం మనం’ : మధు యాష్కీ

రాష్ట్రం ఏర్పడకముందు ‘జనం మనం’.. ఇప్పుడు ‘ధనం మనం’ : మధు యాష్కీ

రాష్ట్రం ఏర్పడకముందు ‘జనం మనం’.. ఇప్పుడు ‘ధనం మనం’ : మధు యాష్కీ
X

బీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కీ గౌడ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎల్బీనగర్లో తనపై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. సెటిలర్లు అనే పతం తాను వాడనని.. ఇక్కడ పుట్టిన వారికి ఎంత హక్కుందో, ఇక్కడికి వచ్చి బతుకుతున్న వారికి కూడా అంతే హక్కు ఉంటుందని చెప్పుకొచ్చారు. మెదక్ లో పుట్టిన కేసీఆర్.. మహబూబ్ నగగర్ లో పోటీ చేయలేదా? గజ్వేల్, కామారెడ్డి, సిరిసిల్లాకు వెళ్లిన పారాచుట్లు కల్వకుంట్ల కుటుంబమని దుయ్యబట్టారు. ఫారిన్ లో అంట్లు తోముకునే సమయంలో.. కవిత పెళ్లికి రావడానికి వీసా కోసం తన సహాయం అడిగింది కేటీఆర్ మర్చిపోయాడని నిలదీశారు. ఉద్యమ సమయంలో శ్రీకాంతచారీ ఒళ్లు తగలబడి పోతుంటే.. కవిత, కేటీఆర్ కలిసి వ్యాపారాలు చేసుకున్నారని మండిపడ్డారు. తాను మాట్లాడితే కేటీఆర్ ఒంటి మీద బట్టలుండవంటూ మధు యాష్కీ సెటైర్లు వేశారు.

సోనియా గాంధీ ఆదేశిస్తే.. పార్లమెంట్ లో బిల్లు పాస్ చేయించింది మధు యాష్కి అని గుర్తుచేశారు. బూత్ లెవల్ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో కేటీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. అంగట్లో పశువులా అమ్ముడు పోయిన సుధీర్ బాబును గొప్ప నాయకుడు అనడం సిగ్గుచేటని అన్నారు. కేటీఆర్ మాటలు వింటుంటే.. దొంగలే సిగ్గుపడేటట్లు ఉన్నాయని ఎద్దేవా చేశారు. దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్లు.. కేటీఆర్, సుధీర్ రెడ్డి కలిసి పదవి అండతో భూకబ్జాలు, దౌర్జన్యాలు చేసి వాటాలు పంచుకున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు జనం మనం అన్న బీఆర్ఎస్ నేతలు.. అధికారంలోకి వచ్చాక ధనం మనం అంటున్నారని విమర్శించారు. ఎలక్షన్స్ లో తప్పక గెలిచి కమిషన్ ఏజెంట్లు, కబ్జాదారుల నుంచి విముక్తి కల్పిస్తామని మధు యాష్కీ హామీ ఇచ్చారు.

Updated : 30 Oct 2023 7:50 AM IST
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top