Home > తెలంగాణ > మోదీని పట్టుకుని భోరుమని ఏడ్చేసిన మంద కృష్ణ మాదిగ

మోదీని పట్టుకుని భోరుమని ఏడ్చేసిన మంద కృష్ణ మాదిగ

మోదీని పట్టుకుని భోరుమని ఏడ్చేసిన మంద కృష్ణ మాదిగ
X

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరుగుతున్న మాదిగల విశ్వరూప బహిరంగ సభలో భావోద్వేగ సన్నివేశం చోటుచేసుకుంది. మాదిగ రిజర్వేషన్ పోరాటసమితి నాయకుడు మంద కృష్ణ మాదిగ.. తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు. తన పక్కనే కూర్చుని ఉన్నర ప్రధాన నరేంద్ర మోదీని పట్టుకుని భోరున విలపించారు. ఎస్సీ వర్గీకరణ ఆవశ్యకతను వివరించిన కృష్ణ మాదిగ దుఃఖాన్ని భరించి లేక ప్రధాని మోదీపై వాలి భోరుమని విలపించారు. మోదీ ఆయను దగ్గరకు తీసుకుని ఓదార్చారు. వెన్ను నిమురుతూ ఊరడించారు. దీంతో సభలో కొన్నినిమిషాలు ఉద్విగ్న వాతావరణం నెలకొంది. అనంతరం కృష్ణ మాదిగ ప్రసంగిస్తూ మాదిగలకు కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు మోసం చేశాయని దుయ్యబట్టారు. దళితులకు మోదీ మాత్రమే న్యాయం చేయగలని అన్నారు.

Updated : 11 Nov 2023 6:54 PM IST
Tags:    
Next Story
Share it
Top