Home > తెలంగాణ > Medaram : మరి కొన్ని గంటల్లో మహాజాతర..ఆ జిల్లాలో నాలుగు రోజులు హాలిడేస్

Medaram : మరి కొన్ని గంటల్లో మహాజాతర..ఆ జిల్లాలో నాలుగు రోజులు హాలిడేస్

Medaram : మరి కొన్ని గంటల్లో మహాజాతర..ఆ జిల్లాలో నాలుగు రోజులు హాలిడేస్
X

మరి కొన్ని గంటల్లో తెలంగాణ కుంభమేళా ప్రారంభం కానుంది. వివిధ రాష్ట్రాల నుంచి ఈ మహాజాతరకు భక్తులు తరలిరానున్నారు. రెండేళ్లకోసారి జరిగే ఈ మేడారం(Medaram) గిరిజన జాతరకు సుమారు రెండు కోట్ల మంది తరలి రానున్నారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కొన్ని లక్షల మంది అమ్మవార్లను దర్శించుకున్నారు. వనదేవతలకు ముందస్తు మొక్కులు చెల్లించుకున్నారు. మరికొంత మంది అమ్మవార్ల దర్శనానికి బారులు తీరనున్నారు. ఈ నేపథ్యంలో ములుగు జిల్లాలో జాతర జరుగనున్న నాలుగు రోజులు ప్రభుత్వం హాలిడేస్ ప్రకటించింది. ఈ నెల 21, 22, 23, 24 తేదీల్లో అన్ని స్కూళ్లు, కార్యాలయాలు పనిచేయవని చెప్పింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు. నాలుగు రోజులపాటు విద్యాసంస్థలను మూసి వేయాలని అధికారులను ఆదేశించారు.

కాగా మహాజాతరకు తెలంగాణ నుంచే కాకుండా ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ తదితర రాష్ట్రాలనుంచి లక్షలాదిగా భక్తులు తరలిరానున్నారు. ఇసుకెస్తే రాలనంత జనంతో మేడారం మరో కుంభమేలాను తలపించనుంది. గిరిజన సాంప్రదాయాల ప్రకారం మహాజాతరను నాలుగురోజుల పాటు నిర్వహించనున్నారు. రేపు కన్నెపల్లి నుంచి సారలమ్మను, ఏటూరునాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజులను పూజారులు తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్ఠిస్తారు. దీంతో తొలిరోజు ఘట్టం పూరైయి సారలమ్మ గద్దెలపై కోలువుతీరుతుంది. ఇక 22న కీలక ఘట్టమైన సమ్మక్కను చిలుకలగుట్ట మీద నుంచి తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠిస్తారు. కుంకుమ భరిణె రూపంలో అమ్మవారిని చూసి భక్తులు పునీతులవుతారు. అమ్మవారికి పోలీసులు, జిల్లా అధికారుల సమక్షంలో గాల్లోకి కాల్పులు జరిపి ఘన స్వాగతం పలుకుతారు. 23వ తేదీన సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు, జంపన్న గద్దెలపై కొలువై భక్తులకు దర్శనమిస్తారు. ఈ మహాఘట్టాన్ని చూసి భక్తులు పులకించిపోతారు. ఆ తర్వాత 24న అమ్మవార్ల వన ప్రవేశంతో జాతర ముగుస్తుంది.

Updated : 20 Feb 2024 8:27 AM GMT
Tags:    
Next Story
Share it
Top