Mahua Moitra : ఎంపీ సభ్యత్వం రద్దు.. సుప్రీంను ఆశ్రయించిన మహువా మొయిత్రా
X
తృణముల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మెయిత్రా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఆమె ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయడంపై ఆమె సుప్రీంకు వెళ్లారు. తనను లోక్ సభ నుంచి బహిష్కరిస్తూ తీసుకున్న నిర్ణయం చట్టవిరుద్ధమని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు. సరైన ఆధారాల్లేకుండా వచ్చిన ఆరోపణలపై సరైన దర్యాప్తు చేయకుండానే తనపై చర్యలు తీసుకున్నారని ఆరోపించింది. దీనిపై విచారణ చేపట్టాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు.
కాగా మహువా డబ్బులు తీసుకుని ప్రశ్నలు అడిగారనే ఆరోపణలపై పార్లమెంటు ఎథిక్స్ కమిటీ ఇచ్చిన నివేదికను లోక్‌సభ ఆమోదించింది. లోక్‌సభ నుంచి మహువాను బహిష్కరించాలంటూ ఎథిక్స్ కమిటీ 500 పేజీల నివేదికలో సిఫార్సు చేసింది. దీనిపై సభలో చర్చించిన తర్వాత ఓటింగ్ నిర్వహించారు. ఎంపీ మహువా అనైతికంగా, అమర్యాదకరంగా ప్రవర్తించారని కమిటీ చేసిన తీర్మానాన్ని సభ అంగీకరించింది. అందుకే ఆమె ఎంపీగా కొనసాగడం తగదనిని స్పీకర్ ఓం బిర్లా వెల్లడించారు. ఆమె లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ.. ఆమెను సభ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.