Pocharam Srinivas Reddy : చిన్న చిన్న లోపాలను కాంగ్రెస్ భూతద్దంలో చూపిస్తోంది..
X
ప్రపంచంలోనే అతి గొప్ప లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరమని కొనియాడారు మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. ప్రాజెక్ట్ ద్వారా లక్షలాది ఏకరాలకు సాగు నీరందించామని అన్నారు. చిన్న చిన్న లోపాలను కాంగ్రెస్ భూతద్దంలో చూపిస్తోందని మండిపడ్డారు. 86 పిల్లర్లకు 3 కుంగితే దానిని బాగుచేయాలని సూచించారు. రైతుబంధు సకాలంలో అందించాం కాబట్టే పంటలు ఐదు రెట్లు పండాయని చెప్పుకొచ్చారు. ప్రాజెక్టులన్ని నీటితో నింపాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం గొప్పతనాన్ని కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని ఆరోపించారు. ప్రాజెక్ట్ కు మరమ్మత్తులు చేయాల్సిది పోయి..రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. సాంకేతిక సమస్యను రాజకీయం చేయడం సరికాదని సూచించారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ ని ప్రపంచం మొత్తం మెచ్చుకుందని గుర్తు చేశారు. బీమా, నేటం పాడు ప్రాజెక్టులు పూర్తి చేసి వలసలు ఆపేసినమని చెప్పారు. కాళేశ్వరంలో మొత్తం196 స్కీం ఉన్నాయనిమూడు పిలర్లు కుంగితే భూతద్దంలో పెట్టి చూస్తున్నారని ఎద్దేవా చేశారు. కల్వకుర్తి ప్రాజెక్టు అసంపూర్తిగా ఉన్న బీఆర్ఎస్ ఎన్నడు బ్లేమ్ చేయలేదన్నారు. రాజకీయ పబ్బం గడపడానికి రైతులను ఫణంగా పెట్టకండని సూచించారు. రైతు ప్రయోజనాలకు అడ్డు పడొద్దని డిమాండ్ చేశారు. రైతుల మేలు కోసం వచ్చే వర్ష కాలం కల్లా సుందిళ్ళ ,అన్నారం, ఎల్లంపల్లి, కొండపోచమ్మ, మల్లన్న సాగర్లో నీటిని నింపండని పోచారం శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.