Nandhikanti Sridhar : రాహుల్ బుజ్జగించినా.. కాంగ్రెస్కు రాజీనామా
X
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. మేడ్చల్ మల్కాజ్గిరి నియోజకవర్గం కాంగ్రెస్ నేత నందికంటి శ్రీధర్ పార్టీకి రాజీనామా చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు తన రాజీనామా లేఖను పంపించారు. శ్రీధర్ గత కొన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్నారు. మల్కాజ్‌గిరి కాంగ్రెస్ నేత పార్టీకి సేవలందించారు. గత పార్లమెంటు ఎలక్షన్స్ లో రేవంత్ రెడ్డి గెలుపు కోసం కూడా ఆయన కృషి చేశారు.
అసంతృప్తితోనే:
తాజాగా మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. అంతేకాకుండా మైనంపల్లికి దాదాపుగా టిక్కెట్ కన్ఫర్మ్ అయింది. దీంతో శ్రీధర్ పార్టీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. మల్కాజ్ గిరి స్థానం విషయంలో.. రాహుల్ గాంధీ, శ్రీధర్ తో స్వయంగా మాట్లాడి బుజ్జగించినా ఫలితం దక్కలేదు. మల్కాజ్‌గిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి కూడా శ్రీధర్ రాజీనామా చేశారు. వచ్చే ఎన్నికల్లో మల్కాజ్ గిరి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని శ్రీధర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.