అందుకే నా జపం చేస్తుండు.. జగ్గారెడ్డి వ్యాఖ్యలకు మల్లారెడ్డి కౌంటర్
X
మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలకు మల్లారెడ్డి కౌంటర్ ఇచ్చారు. మల్లారెడ్డి కూడా కాంగ్రెస్‌లోకి రావచ్చన్న ఆయన వ్యాఖ్యలపై మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా ఫోకస్ అయ్యేందుకే జగ్గారెడ్డి పదే పదే తన పేరు ఎత్తుతున్నారని అన్నారు. తన పేరు ఎత్తకపోతే ఆయనను ఎవరూ పట్టించుకోరని అందులో తన జపం చేస్తున్నారని విమర్శించారు.
ఎంపీ టికెట్ ఆశిస్తున్న జగ్గారెడ్డి అందుకోసమే సీఎం రేవంత్ రెడ్డిని పొడుతున్నాడని మల్లారెడ్డి అన్నారు. కేసీఆర్ కుటుంబంలో మూడు పదవులు ఉన్నట్లు తమ కుటుంబం నుంచి మూడు పదవులు ఉండాలని అనుకున్నామని చెప్పారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో తన కుమారుడు భద్రారెడ్డి మల్కాజ్గిరి నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడని అన్నాడు.
గురువారం మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ దగ్గర మంత్రిని, ముఖ్యమంత్రిని ఎవరైనా కలవవచ్చని, బీఆర్ఎస్లో కేసీఆర్ను కలవాలంటే నలుగురిని దాటి వెళ్లాలని అన్నారు. అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. మాజీ మంత్రి మల్లారెడ్డి మౌనంగా ఉన్నారని, ఆయన కూడా కాంగ్రెస్‌లోకి రావచ్చని అభిప్రాయపడ్డారు.