సీఎం రేవంత్ రెడ్డికి మల్లారెడ్డి విజ్ఞప్తి.. వాటిని కాపాడాలని..
X
మాజీ మంత్రి మల్లారెడ్డి అంటే బీఆర్ఎస్కే ఓ బ్రాండ్. మైకు పట్టుకున్నారంటే చాలు డైలాగులతో అల్లాడిస్తుంటారు. తన కామెంట్లతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. 2018లో మేడ్చల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. ఈ సారి కూడా అక్కడి నుంచే బరిలోకి దిగి మరోసారి గెలిచారు. ఇక మల్లారెడ్డికి సీఎం రేవంత్ రెడ్డికి అస్సలే పడదు. అప్పట్లో వీరిద్దరూ ఒకరిపై ఒకరు ఆరోపణలు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. అయితే ప్రస్తుతం రేవంత్ సీఎం అయ్యారు.. ఈ క్రమంలో ఆయనకు మల్లారెడ్డి ఓ విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలో ఐటీ, రియల్ ఎస్టేట్ రంగాలను కాపాడాలని సీఎం రేవంత్ రెడ్డికి మల్లారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆ రెండు రంగాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. మాజీ మంత్రి కేటీఆర్ లేని హైదరాబాద్‌ను ఐటీ ఉద్యోగులు చూడలేకపోతున్నారని అన్నారు. కేసీఆర్ ఓడిపోతారని ఎవరూ ఊహించలేదని.. ఆయన ఓడిపోయినందుకు అందరూ బాధపడుతున్నట్లు చెప్పారు. కళ్ళల్లో ఒత్తులు వేసుకుని మరీ కేసీఆర్ రాష్ట్రాన్ని ఒక మోడల్‌గా తయారు చేశారని ప్రశంసించారు. కేసీఆర్ ఆరోగ్యం మెరుగుపడుతుందని..మరో రెండు మూడు రోజుల్లో డిశ్చార్జ్ అయ్యే అవకాశముందని చెప్పారు.