Home > తెలంగాణ > Mallareddy : నాపై అక్రమ కేసు పెట్టారు..హైకోర్టును ఆశ్రయించిన మల్లారెడ్డి

Mallareddy : నాపై అక్రమ కేసు పెట్టారు..హైకోర్టును ఆశ్రయించిన మల్లారెడ్డి

Mallareddy :  నాపై అక్రమ కేసు పెట్టారు..హైకోర్టును ఆశ్రయించిన మల్లారెడ్డి
X

మాజీ మంత్రి మల్లారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసును కొట్టేయాలని కోర్టును కోరారు. మేడ్చల్‌ జిల్లా మూడుచింతపల్లి మండలం కేశవాపురం గ్రామంలో భూములను కబ్జా చేశారన్న ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే శామీర్‌పేట పోలీసులు తనపై నమోదు చేసిన కేసు అక్రమమని..దానిని కొట్టివేయాలంటూ ఆయన కోర్టులో పిటిషన్‌ వేశారు. సోమవారం జస్టిస్‌ సురేందర్‌ ముందుకు ఈ పిటిషన్‌ విచారణకు వచ్చింది. అయితే రాజకీయ నాయకుల కేసులను విచారించే బెంచ్‌కు ఈ పిటిషన్‌ను బదిలీ చేయాలని రిజిస్ట్రీని న్యాయమూర్తి ఆదేశిస్తూ.. విచారణను వాయిదా వేశారు.


Updated : 19 Dec 2023 7:18 AM IST
Tags:    
Next Story
Share it
Top