Home > తెలంగాణ > ఆర్టీసీ విలీనం... మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఆర్టీసీ విలీనం... మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఆర్టీసీ విలీనం... మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ మేరకు బిల్లు కూడా పెట్టనున్నారు. ఈ నిర్ణయంతో 43,373 మంది ఆర్టీసీ ఉద్యోగులకు లబ్ది చేకూరనుంది. ఆర్టీసీని కాపాడటంతో పాటు ప్రజారవాణాను మరింత పటిష్టం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఈ క్రమంలో ఆర్టీసీ విలీనంపై మంత్రి మల్లారెడ్డి ఆసక్తకర వ్యాఖ్యలు చేశారు. బుధవారం (ఆగస్టు 2) మీడియాతో మాట్లాడిన ఆయన.. ఓ మీడియా ప్రతినిధి ‘ఆర్టీసీ విలీనం ఎన్నికల స్టంటా?’ అడిగిన ప్రశ్నకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.

‘ఆర్టీసీ విలీనం ఎన్నికల స్టంట్ అనుకో.. ఇంకేదైనా అనుకో.. కార్మికుల భవిష్యత్తు కోసం ఆలోచించే పార్టీ మాది. ప్రభుత్వ నిర్ణయంతో వాళ్లు సంతోషంగా ఉన్నారు. అయినా, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటే.. దమ్ము, ధైర్యం, ఫండ్స్ ఉండాలి. అవన్నీ ఉన్న ఏకైక పార్టీ బీఆర్ఎస్. అయినా మాది రాజకీయ పార్టీ. ఎన్నికలకు వెళ్తున్నాం. కాబట్టి ఎలాగైనా ఎన్నికల స్టంట్ ఉంటుంద’ని మల్లారెడ్డి అన్నారు.


Updated : 2 Aug 2023 11:08 AM GMT
Tags:    
Next Story
Share it
Top