పెద్దపల్లి ఎంపీ కాంగ్రెస్లో అందుకోసమే చేరిండు : MallaReddy
X
పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ గూటికి చేరారు. వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీలో చేరడంపై మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీలో టికెట్ రాదనే ఆయన కాంగ్రెస్లో చేరారని ఆరోపించారు. కాంగ్రెస్లోనూ ఆయనకు టికెట్ రాదని చెప్పారు. పెద్దపల్లి నుంచి ఎమ్మెల్యే వెంకటస్వామి కొడుకు టికెట్ ఆశిస్తున్నారని తెలిపారు. ‘‘నన్ను కూడా అన్నీ పార్టీల నేతలు పిలుస్తున్నారు. కానీ నేను ఏ పార్టీలోకి వెళ్లను అని మల్లారెడ్డి స్పష్టం చేశారు.
రేవంత్ సర్కార్ ప్రజల కోసం పనిచేయడం మానేసి ప్రతిపక్షాలను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. కేసీఆర్పై అనుచితంగా మాట్లాడితే సహించేది లేదని స్పష్టం చేశారు. రేవంత్ మాటలకు నిరసనగా ప్రజలు రోడ్లపైకి వచ్చిన నిరసన తెలపాలని పిలుపునిచ్చారు. కాగా పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ గూటికి చేరారు. కాంగ్రెస్ ప్రధాని కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వెంకటేష్ నేత 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ తరుపున చెన్నూరు నుంచి పోటీ చేసి బాల్కసుమన్ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరుపున పెద్దపల్లి నుంచి పోటీ చేసి గెలిచారు.