Home > తెలంగాణ > నెత్తిన గొంగడి..చేతిలో కర్ర..గొర్రెల కాపరైన మంత్రి మల్లారెడ్డి

నెత్తిన గొంగడి..చేతిలో కర్ర..గొర్రెల కాపరైన మంత్రి మల్లారెడ్డి

నెత్తిన గొంగడి..చేతిలో కర్ర..గొర్రెల కాపరైన మంత్రి మల్లారెడ్డి
X

తనదైన శైలిలో పంచ్ డైలాగ్‌లు పేల్చుతూ, నృత్యాలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిస్తుంటారు తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి . అయితే ఈ సారి మాత్రం గొర్రె కాపరి అవతారమెత్తి అందరినీ ఆకట్టుకున్నారు. గురువారం మేడ్చల్ మండలం గౌడవెల్లి గ్రామంలో జరిగిన గొర్రెల పంపిణీ కార్యక్రమానికి వచ్చిన మంత్రి లబ్ధిదారులకు గొర్రెలు పంపిణీ చేశారు. ఆ తరువాత తనదైన ట్రేడ్ మార్కు విన్యాసాలకు తెరలేపారు. నెత్తిన గొంగడి కప్పుకుని, చేతిలో కర్ర పట్టుకుని కాసేపు గొర్రెల కాపరి అవతారమెత్తి గొర్లు కాశారు. గొర్రెలను కాస్తూ మంత్రి ఇచ్చిన పోజులు ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.

ఇదిలా ఉంటే గొర్రెల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మంత్రి మాట్లాడుతూ.." రాష్ట్రంలో తొమ్మిదేళ్లకు ముందు ఏ ప్రభుత్వం కూడా కుల సంఘాలను ఆదుకోలేదు. సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చాక అన్ని కులాల ప్రజలను ఆదుకుంటున్నారు. కురుమ యాదవులకు మరింత లబ్ది చేకూర్చేందుకు సర్కార్ ప్రయత్నిస్తోంది. నిజంగా మనందరం అదృష్టవంతులం. కేసీఆర్ వంటి నేత ముఖ్యమంత్రిగా ఉన్నారు. కేటీఆర్ కూడా ప్రజలతోనూ ఉన్నారు"అని మంత్రి తెలిపారు.


Updated : 6 July 2023 1:58 PM GMT
Tags:    
Next Story
Share it
Top