Home > తెలంగాణ > Mallareddy : బీజేపీతో పొత్తు ఉన్నా.. ఆ ఎంపీ టికెట్ మాదే మల్లారెడ్డి షాకింగ్ కామెంట్స్

Mallareddy : బీజేపీతో పొత్తు ఉన్నా.. ఆ ఎంపీ టికెట్ మాదే మల్లారెడ్డి షాకింగ్ కామెంట్స్

Mallareddy  : బీజేపీతో పొత్తు ఉన్నా.. ఆ ఎంపీ టికెట్ మాదే మల్లారెడ్డి షాకింగ్ కామెంట్స్
X

భారతీయ జనతా పార్టీతో బీఆర్‌ఎస్ పార్టీ పొత్తు కుదిరే ఛాన్స్ ఉందని తెలంగాణలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ప్రచారంలో వాస్తవం లేదని పలువురు బీజేపీ నేతలు ఖండిస్తున్నారు. ఈ నేపధ్యంలో మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో బీఆర్‌ఎస్‌ పొత్తున్నా.. మల్కాజిగిరి ఎంపీ టికెట్‌ మాదే అని బాంబు పేల్చిన చారు. మల్కాజిగిరి ఎంపీ టికెట్‌ భద్రంగా ఉందని అన్నారు. ‘నా కుమారునికి టికెట్‌ ఇస్తే కుటుంబం అని ప్రచారం చేయడం తగదు. మా అల్లుడు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి కుటుంబం వేరు. మా కుటుంబం వేరు. అందరినీ కలిపి కుటుంబం అని అనడం సరికాదు’’ అని అభిప్రాయపడ్డారు.అయితే మల్లారెడ్డి తనయుడు భద్రారెడ్డికి బీఆర్‌ఎస్ ఎంపీ టికెట్ ఖాయం అయినట్లు తెలుస్తోంది. ఎంపీ బండి సంజయ్‌తో అయ్యేది లేదు.. పొయ్యేది లేదని మల్లారెడ్డి అన్నారు.

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలోఈ కామెంట్స్‌గా మారినాయి. అదే విధంగా తన వర్సిటీలలో అక్రమ కట్టడాలు ఉంటే ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చని, కావాలని తనపై కక్ష సాధించాలనుకుంటే ఏమీ చేయలేనని మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్‌తో ఎట్టి పరిస్థితుల్లో పొత్తు ఉండదని బీజేపీ కీలక నేతలు తేల్చి చెబుతుండగా.. బీఆర్ఎస్ లీడర్లు మాత్రం బీజేపీతో పొత్తు విషయంపై నోరు విప్పడం లేదు. దీంతో బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు వార్తలకు మరింత బలం చేకూరింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఖరా ఖండీగా చెప్పేస్తున్నారు. పైగా వలసలను ఆపడానికి మాజీ సీఎం కేసీఆర్ ఆడుతున్న డ్రామా ఇదంటున్నారు. 8 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఐదుగురు సిట్టింగ్ బీఅర్ఎస్ ఎంపీలు తమతో టచ్‌లో ఉన్నారని మీడియాతో చిట్ చాట్‌లో చెప్పారు సంజయ్ . అవినీతి పార్టీలతో మోదీ పొత్తు పెట్టుకోరని,.. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే ఎన్డీఏలో చేర్చుకోని ప్రధాని.. ఇప్పుడెందుకు చేర్చుకుంటారన్నారు. కాళేశ్వరంపై రోజూ మాట్లాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి కేసులు పెట్టడం లేదన్నారు సంజయ్. కాంగ్రెస్ కొట్టినట్లు చేస్తుంటే.. బీఆర్ఎస్ ఎడ్చినట్లు చేస్తుందన్నారు.




Updated : 17 Feb 2024 7:54 AM IST
Tags:    
Next Story
Share it
Top