Alfa Hotel: ఖమ్మం నుంచి సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్‌కు బాంబు బెదిరింపు
X
సికింద్రాబాద్‌లో నిత్యం రద్ధీగా ఉండే ఆల్ఫా హోటల్ లో బాంబు పెట్టినట్టు ఫేక్ కాల్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం రాత్రి ఆల్ఫా హోటల్ బాంబు పెట్టినట్టు ఓ అగంతకుడు కాల్ చేశాడు. శనివారం రాత్రి 10.45 గంటలకు 100 నంబర్‌కు ఫోన్ చేసి బెదిరించాడు. వెంటనే పోలీసులు ఆల్ఫా హోటల్ వద్దకు చేరుకుని, అక్కడ ఉన్న హోటల్ సిబ్బందిని బయటకు పంపించేసి.హోటల్ మొత్తాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. దాదాపు 2 గంటల పాటు లోపల బాంబు కోసం వెతికారు. చివరకు ఆ హోటల్‌లో బాంబు లేదని బాంబ్ స్క్వాడ్ తేల్చారు. తమకు వచ్చింది ఫేక్ కాల్‌గా నిర్ధారించుకున్నారు. ఫేక్ కాల్ చేసిన నెంబర్‌ను ట్రేస్ చేయగా.. ఆ కాల్ చేసిన వ్యక్తిని గౌస్ పాషా(39) గా గుర్తించారు. నిందితుడు గౌస్ పాషాను మోండా మార్కెట్ పోలీసులు ఖమ్మంలో అరెస్ట్ చేశారు. అతణ్ని కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.