Home > తెలంగాణ > విమానంలో ఏపీ మహిళపై కామాంధుడి వికృత చేష్టలు

విమానంలో ఏపీ మహిళపై కామాంధుడి వికృత చేష్టలు

విమానంలో ఏపీ మహిళపై కామాంధుడి వికృత చేష్టలు
X

రోడ్లు, సినిమా హాళ్లు, బస్సులు, రైళ్లు, మందిరాలనే కాదు చివరికి విమానాలను సైతం కామాంధులు వదిలిపెట్టడం లేదు. మర్యాద, చదువులు సంస్కారం ఉంటాయని జనం భ్రమపడే పెద్ద మనుషుల ముసుగులోని కొందరు విమానాల్లో ఘోరాలకు పాల్పడుతున్నారు. జర్మనీ నుంచి బెంగళూరుకు విమానంలో వస్తున్న ఓ తెలుగు మహిళపై ఓ నీచుడు లైంగిక దాడికి ప్రయత్నించాడు. ఆమె ప్రైవేట్ పార్ట్స్ తాకుతూ ప్రయాణం సాంతం వికృతంగా ప్రవర్తించాడు. విమానం బెంగళూరు కెంపేగౌడ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయిన వెంటనే పోలీసులు అతణ్ని అరెస్ట్ చేశారు.

ఈ నెల 6న జర్మనీ నుంచి బెంగళూరుకు వచ్చిన లుఫ్తాన్సా కంపెనీ విమానంలో ఈ దారుణం జరిగింది. తిరుపతికి చెందిన 32 ఏళ్ల మహిళపై ఆమె పక్కనే కూర్చున్న 52 ఏళ్ల వ్యక్తి వేధింపులకు పాల్పడ్డాడు. బాధితురాలు విమాన సిబ్బందికి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. తను నిద్రపోతుండగా తనపై అసభ్యంగా చేతులు వేశాడని ఆమె తెలిపింది. హెచ్చరించినా వినలేదని, చివరకు సిబ్బంది సాయంతో వేరే సీట్లో కూర్చున్నానని చెప్పింది. ఫిర్యాదు స్వీకరించిన ఎయిర్ పోర్ట్ పోలీసులు నిందతుణ్ని అరెస్ట్ చేసి చేశారు. ఐపీసీ సెక్షన్‌ 354 ఎ కింద లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. కోర్టుకు హాజరుపరచగా జడ్జి అతణ్ని బెయిల్‌పై విడుదల చేశారు.


Updated : 8 Nov 2023 8:59 PM IST
Tags:    
Next Story
Share it
Top