Home > తెలంగాణ > షటిల్ ఆడుతుండగా గుండెపోటు...

షటిల్ ఆడుతుండగా గుండెపోటు...

షటిల్ ఆడుతుండగా గుండెపోటు...
X

గుండెపోటులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆరోగ్యవంతులు, విద్యార్థులు, యువకుల గుండెలు ఒక్కసారిగా ఆగిపోవడం కలకలం రేపుతోంది. అప్పటి వరకు ఎంతో ఉత్సాహంగా ఉన్నవారు కుప్పకూలిపోతున్నారు. క్రికెట్ ఆడుతూ, డ్యాన్స్ చేస్తూ, షటిల్ కోర్టులో క్షణాల్లోనే ప్రాణాలు కోల్పోవడం కలచివేస్తోంది. ఇటీవల డ్యాన్స్ చేస్తూ కరీంనగర్‎కు చెందిన విద్యార్థి గుండెపోటుతో మరణించింది. రెండు రోజుల క్రితం నంద్యాల బేతంచెర్ల పట్టణంలోని సంజీవనగర్‌ కాలనీకి చెందిన మహేంద్ర..స్నేహితులతో క్రికెట్‌ ఆడుతుండగా మైదానంలోనే ప్రాణాలు విడిచాడు.





ఈ ఘటనలు మర్చిపోక ముందే తెలుగు రాష్ట్రాల్లో మరో వ్యక్తి గుండెపోటుకు గురై క్షణాల్లో చనిపోయాడు. హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో షెటిల్ ఆడుతూ ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన విషాదాన్ని నింపుతోంది. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధి రామంతాపూర్‌లోని కృష్ణారెడ్డి అనే వ్యక్తి షటిల్ ఆడుత గుండెపోటుతో కుప్పకూలాడు. వెంటనే అతడిని స్నేహితులు, స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే కృష్ణారెడ్డి మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న వ్యక్తి చనిపోవంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

ఇప్పటికే షటిల్ ఆడుతూ గుండెపోటుతో మరణించిన ఘటన ఇప్పటికే హైదరాబాద్‌లో రెండు, మూడు జరిగాయి


Updated : 16 Aug 2023 11:34 AM GMT
Tags:    
Next Story
Share it
Top