Home > తెలంగాణ > 'ఇంటర్నెట్‌లో నీ వీడియోలు పెడతా'.. నాలుగో భర్తకు వేధింపులు..

'ఇంటర్నెట్‌లో నీ వీడియోలు పెడతా'.. నాలుగో భర్తకు వేధింపులు..

మరో 13 మందికి టోకరా వేసిన కి'లేడి'

ఇంటర్నెట్‌లో నీ వీడియోలు పెడతా.. నాలుగో భర్తకు వేధింపులు..
X


ఇంతకుముందు పెళ్లి అంటే అబ్బాయి, అమ్మాయి కుటుంబాల పరస్పర అంగీకారంతో , మంచి చెడులు చర్చించుకుని ఇరుపక్షాల సమ్మతితో జరిగేవి. ఇంటర్నెట్ కాలం కనుక ఇప్పుడంతా ఆన్‌లైన్ ట్రెండ్ నడుస్తోంది. షాది డాట్ కామ్ ద్వారా పరిచయమైన ఒక అమ్మాయిని మెచ్చి నచ్చి పెళ్లి చేసుకున్న ఓ అభాగ్యుడికి చివరకు చుక్కలు కనిపించాయి. పెళ్లై రెండు నెలలు గడిచాక సీన్ మారింది. కట్టుకున్న భార్య చేతిలో చిత్రహింసలు అనుభవించాడు. మరో షాకింగ్ విషయం ఏంటంటే తాను ఆ భార్యకు నాల్గవ భర్త అని తెలిసి లబోదిబోమన్నాడు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఈ ఫ్యామిలీ క్రైమ్ స్టోరీ నడిచింది.




బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లాకు చెందిన మెండే అనూష కు గోదావరిఖని ఎన్టీపీసీకి చెందిన సుద్దాల రేవంత్ లకు షాదీ డాట్ కామ్ లో పరిచయం ఏర్పడింది. ఇరువురి అభిప్రాయాలు కలవడంతో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. రెండు నెలలు పాటు అంతా బాగానే జరిగింది. ఆ తర్వాత అనుష విశ్వరూపాన్ని బయట పెట్టింది. అనూషకు మద్యం, సిగరెట్ అలవాటు ఉందనీ, తనకు ఇప్పించాలంటూ ప్రతి రోజు గొడవ చేసేదన్నారు. నిత్యం వేధింపులకు గురి చేస్తూ గొడవలు పడేదనీ, గంటలు గంటలు ఫోన్ లో మాట్లాడేదని ఆరోపించారు. గత నెల తన బంధువుల ఇంటికి వెళ్ళొస్తానని చెప్పి.. 4 తులాల బంగారం, 70 వేల నగదు పట్టుకుని పరార్ అయ్యిందనీ, ఫోన్ చేస్తే సరిగా స్పందించలేదని బావురుమన్నాడు. కానీ, గత వారం తన భార్య ఫోన్ చేసి.. రమ్మంటే హైదరాబాద్ వెళ్లానని, అక్కడ ప్లాన్ ప్రకారం.. తన స్నేహితులతో గదిలో బంధించి చిత్రహింసలకు గురి చేసిందనీ వాపోయాడు. మర్యాదగా రూ.10 లక్షలు ఇవ్వకపోతే.. తన పర్సనల్ వీడియోలను బయటపెడతానని బెదిరింపులకు పాల్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

తన స్నేహితులు, బంధువుల దగ్గర తన గోడు వెళ్లబోసుకోగా .. అనూషకు గతంలోనే నాలుగు పెళ్లిళ్లు అయ్యాయన్న షాకింగ్ నిజం తెలిసిందన్నాడు. వారిని కూడా తన అలాగే.. బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు లాగిందని ఆరోపించారు. అదొక్కటే కాదు.. మరో 13 మందికి టోకరా ఇచ్చిందని తెలిపాడు. అనూష నుండి తనకు ప్రాణభయం ఉందని,తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించినట్లు రేవంత్ తెలిపారు.




Updated : 4 July 2023 7:51 AM IST
Tags:    
Next Story
Share it
Top