Home > తెలంగాణ > బస్సులోనే ప్రయాణికుడి మృతి.. అదే బస్సులో ఇంటికి తీసుకెళ్లి అప్పగించిన సిబ్బంది

బస్సులోనే ప్రయాణికుడి మృతి.. అదే బస్సులో ఇంటికి తీసుకెళ్లి అప్పగించిన సిబ్బంది

బస్సులోనే ప్రయాణికుడి మృతి.. అదే బస్సులో ఇంటికి తీసుకెళ్లి అప్పగించిన సిబ్బంది
X

మనుషుల్లో మానవత్వం ఇంకా మిగిలే ఉంది అనడానికి నిదర్శనం ఈ ఘటన. ఈ రోజుల్లో ప్రమాదం జరిగి రోడ్డు పక్కన పడి ఉన్నవాళ్లను చూసి.. ‘మనకెందుకు లే ఈ తల నొప్పి’ అంటూ సాయం చేయకుండా వెళ్తున్నారు. పక్కొడి ప్రాణం పోతున్నా చూసీ చూడనట్టు వెళ్లే వాళ్లూ ఉన్నారు. అయితే, తెలంగాణ ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ మాత్రం మానవ సంబంధాలు ఇంకా ఉన్నాయని నిరూపించారు. తాము నడిపిస్తున్న బస్సులో గుండెపోటుతో చనిపోయిన వ్యక్తి శవాన్ని ఇంటికి చేర్చి.. శభాష్ అనిపించుకున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరి గురించి సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.

జూన్ 14వ తారీకు జరిగిందీ ఘటన. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న హుస్సెన్ అనే వ్యక్తికి హార్ట్ ఎటాక్ వచ్చింది. తోటి ప్రయాణికులు అంబులెన్స్ కు ఫోన్ చేసేంతలోనే అతను చనిపోయాడు. దాంతో బస్సులో ప్రయాణిస్తున్నవాళ్లంతా.. ‘తమకెందుకు లే’ అంటూ బస్సు దిగి వెళ్లిపోయారు. అది చూసిన బస్ డ్రైవర్ కొమురయ్య, కండక్టర్ నాగయ్య అంబులెన్స్ కో, పోలీసులకో మృతదేహాన్ని అప్పగించి చేతులు దులుపుకోలేదు. డిపో మేనేజర్ పర్మిషన్ తీసుకుని.. మహబూబ్ నగర్ కు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న హుస్సెన్ స్వగ్రామం మోదుగుల గూడెంకు అదే బస్సులో తీసుకెళ్లి.. కుటుంబ సభ్యులకు అప్పగించారు. బస్ డ్రైవర్, కండక్టర్ మానవత్వంతో స్పందించిన తీరు చూసి ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ వారిని హైదరాబాద్ పిలిపించి అభినందించారు.









Updated : 19 Jun 2023 5:38 PM IST
Tags:    
Next Story
Share it
Top