Water Supply Disrupted: మహా నగరంలో మంజీరా నీళ్లు బంద్!
X
హైదరాబాద్ మహా నగరానికి తాగునీటి సరఫరా చేసే మంజీరా నీటి పంపిణీకి అంతరాయం ఏర్పడింది. మంజీరా ప్రాజెక్ట్ ఫేజ్ 2లో పటాన్ చెరు నుంచి హైదర్ నగర్ వరకు పైప్ లైన్ కు భారీ లీకేజీ ఏర్పడింది. ఈ లీకేజీ రిపేర్ నిమిత్తం బుధవారం (నవంబర్ 1) ఉదయం 6 గంటల నుంచి గురువారం ఉదయం 6 గంటల వరకు నీటి సరఫరాను నిలిపివేయనున్నారు. ఆయా డివిజన్ల పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండదని మెట్రో వాటర్ బోర్డ్ అధికారులు ప్రకటించారు. ఎర్రగడ్డ, అమీర్ పేట్ (లోప్రెజర్ తో నీటిసరఫరా), ఎస్ఆర్ నగర్, హాఫ్ టెక్ పాయింట్లు, బల్క్ కనెక్షన్లు, కేపీహెచ్ బీ కాలనీ, కూకట్ పల్లి, భాగ్య నగర్ కాలనీ, వసంత్ నగర్, ఆర్సీ పురం, అశోక్ నగర్, జ్యోతినగర్, లింగంపల్లి, చందానగర్, గంగారం, దీప్తి శ్రీ నగర్, మదీనాగూడ, మియాపూర్, బీరంగూడ, అమీన్ పూర్, బొల్లారం తదితర ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిపేస్తున్నట్లు వాటర్ బోర్డ్ అధికారులు ప్రకటించారు.