Home > తెలంగాణ > Sitaram Naik : బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్..బీజేపీలో చేరిన పలువురు నేతలు

Sitaram Naik : బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్..బీజేపీలో చేరిన పలువురు నేతలు

Sitaram Naik : బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్..బీజేపీలో చేరిన పలువురు నేతలు
X

లోక్ సభ ఎన్నికల ముందు బీఆర్‌ఎస్‌కు పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ నేతలు, మాజీ ఎంపీలు సీతారాం నాయక్, గోడం నగేశ్, మాజీ ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, జలగం వెంకట్రావు కాషాయ పార్టీ కండువా కప్పుకున్నారు.. బీజేపీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ తరుణ్ చుగ్, లక్ష్మణ్ పార్టీ కండువా కప్పి వారిని ఆహ్వానించారు. హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన సైదిరెడ్డి.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. కేటీఆర్‌కు అంత్యంత సన్నిహితుడిగా సైదిరెడ్డికి పేరుంది. ఇక జలగం వెంకట్రావు ఖమ్మం జిల్లాలో కీలక నేత. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా నుంచి ఆయనొక్కరే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలపొందారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. దాంతో అసంతృప్తిలో ఉన్న జలగం బీజేపీలో చేరారు. వీరే కాదు.. రానున్న రోజుల్లో మరికొందరు నేతలు సైతం బీజేపీలో చేరుతారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.బీఆర్ఎస్ నేతలు బీజేపీలో చేరిన సందర్భంగా రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతు తెలంగాణలో బీఆర్ఎస్ పని ఖతం అయిపోయిందన్నారు. తెలంగాణలో గతంలో కంటే ఎక్కువ లోక్ సభ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎలాంటి ఆరోపణలు లేకుండా ప్రధాని మోదీ ప్రభుత్వం దేశం కోసం పని చేస్తుందన్నారు లక్ష్మణ్.




Updated : 10 March 2024 6:27 PM IST
Tags:    
Next Story
Share it
Top