Home > తెలంగాణ > ఎన్నికల వేళ రెచ్చిపోయిన మావోయిస్టులు.. 25మంది కిడ్నాప్..

ఎన్నికల వేళ రెచ్చిపోయిన మావోయిస్టులు.. 25మంది కిడ్నాప్..

ఎన్నికల వేళ రెచ్చిపోయిన మావోయిస్టులు.. 25మంది కిడ్నాప్..
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ వేళ మావోయిస్టులు రెచ్చిపోయారు. భద్రాద్రి కొత్తగూడానికి చెందిన 25 మంది వ్యాపారులను కిడ్నాప్ చేశారు. తమకు వ్యతిరేకంగా పనిచేస్తూ పోలీసులకు సహకరిస్తే హతమారుస్తామని హెచ్చరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలానికి చెందిన 25 మంది వ్యాపారులు ఇవాళ ఉదయం ఛత్తీస్‌గఢ్‌ సుక్మా జిల్లాలోని గొల్లపల్లిలో జరిగే మార్కెట్కు వెళ్లారు. అయితే తాళ్లగూడెం - గొల్లపల్లి క్రాస్‌ రోడ్డు వద్ద మావోయిస్టులు వారి వాహనాలను అడ్డుకుని వ్యాపారులపై బెదిరింపులకు పాల్పడ్డారు. తమకు వ్యతిరేకంగా పోలీసులకు సహకరిస్తే హతమారుస్తామని హెచ్చరించి వదలిపెట్టారు.

మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టులు అమర్చిన మందు పాతర వెలుగులోకి వచ్చింది. చర్ల మండలంలోని బెస్త కొత్తూరు - అంజినాపురం గ్రామాల మధ్య మావోయిస్టులు అమర్చిన మందు పాతరను పోలీసులు వెలికి తీశారు. కాగా మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

Updated : 30 Nov 2023 1:44 PM IST
Tags:    
Next Story
Share it
Top