Home > తెలంగాణ > వివాహిత ఫొటోలు మార్ఫింగ్..యువకుడి మెంటల్ టార్చర్

వివాహిత ఫొటోలు మార్ఫింగ్..యువకుడి మెంటల్ టార్చర్

వివాహిత ఫొటోలు మార్ఫింగ్..యువకుడి మెంటల్ టార్చర్
X

ఫోటోలను మార్ఫింగ్ చేసి తణుకు పట్టణానికి చెందిన ఓ వివాహితను మానసికంగా వేధించాడు ఓ దుర్మార్గుడు. ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి వివాహిత ఫోటోలన డౌన్‌లోడ్‌ చేసి వాటిని నగ్నంగా మార్ఫింగ్‌ చేసి సామాజిక మాధ్యమాల్లో పెడతానని గత కొంత కాలంగా వేధిస్తున్నాడు. భర్తతో సంతోషంగా ఉన్న ఆమె కాపురంలో విభేధాలు సృష్టించేందుకు ప్రయత్నించాడు. బాధిత మహిళ యువకుడి ఆగడాలను తగట్టుకోలేక పోలీసులను ఆశ్రయించింది. ఆ ఆకతాయి వేధింపుల నుంచి బయటపడేయాలంటూ పోలీసులకు విజ్ఞప్తి చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బుధవారం ఆ ఆకతాయిని అరెస్టు చేశారు. ఈ విషయాన్ని తణుకు పట్టణ ఇన్ ఛార్జి సీఐ ఆంజనేయులు తెలిపారు.





హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌‎కు చెందిన అభిషేక్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తణుకుకు చెందిన ఒక వివాహితతో పరిచయం పెంచుకున్నాడు. మొదట అంతా బాగానే ఉంది. కానీ అదను చూసి ఇన్‌స్టాగ్రామ్‌‎లో ఆమె ఫొటోలను డౌన్‎లోడ్ చేశాడు. వాటిని మార్ఫింగ్‌ చేసి ఆమెను మానసికంగా వేధించడం మొదలు పెట్టాడు. దీంతో ఆ యువకుడి ఆగడాలు భరించలేక ఆమెతో పాటు ఆమె భర్త పోలీసులకు తమ సమస్యను తెలిపారు. తణుకు పట్టణ పోలీసు స్టేషన్‎లో కేసు నమోదు చేశారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఎస్పీ రవిప్రకాశ్‌, తాడేపల్లిగూడెం డీఎస్పీ శరత్‌కుమార్‌ల ఆధ్వర్యంలో ఎట్టకేలకు నిందితుడిని అరెస్టు చేశారు. కోర్టులో అభిషేక్‌‎ను హాజరుపరిచి రిమాండ్‌ విధించారు.






Updated : 25 Aug 2023 5:09 PM IST
Tags:    
Next Story
Share it
Top