నిజామాబాద్‌లో అర్థరాత్రి ముసుగు దొంగల హల్ చల్..ఏం చేశారంటే?
దొంగలు బాబోయ్ దొంగలు అంటోంది నిజామాబాద్ నగరం. వరుసగా జరుగుతున్న దొంగతనాలు ప్రజలను , షాపుల ఓనర్లను హడలెత్తిస్తున్నాయి. మాటు వేసి మరి అర్థరాత్రి వేళల్లో దుఖానాలను కొల్లగొడుతున్నారు ముసుగు దొంగలు. షట్టర్లును పగులగొట్టి అందినకాడికి దోచుకెళ్తున్నారు. ఇళ్లల్లోనూ చోరీలకు పాల్పడుతూ ప్రజలను ముప్పుతిప్పలు పెడతున్నాయి. తాజాగా ఓ దుఖానంలోకి దూరిన ముసుగు దొంగలు లక్షల రూపాయల నగదును దోచుకెళ్లారు. ఆ దోపిడీ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో ప్రజలు షాక్‌కి గురవుతున్నారు.
నిజామాబాద్ నగరంలో ముసుగు దొంగలు హల్ చల్ చేస్తున్నారు. వరుస దోపిడీలతో పోలీసులకు సవాల్ విసురుతున్నారు. అర్ధరాత్రి రెండుగంటల సమయంలో ముసుగు ధరించి ఓ షో రూమ్‌లోకి ప్రవేషించారు.షో రూంలో సిసి కెమెరాలు ధ్వంసం చేశారు. లక్ష రూపాయల నగదు దోచుకెళ్లారు. సెక్యూరిటీ గార్డు ఉండగానే వెనక నుంచి దుండగులు చొరబడ్డారు. మహా రాష్ట్రకు చెందిన ముఠాలుగా పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలో చెడ్డి గ్యాంగులు కూడా నిజామాబాద్ లో ఇలానే హాల్ చల్ చేశాయి. సిసి పుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.