Home > తెలంగాణ > Fire Accident : కరీంనగర్లో భారీ అగ్నిప్రమాదం.. గుడిసెలు దగ్ధం..

Fire Accident : కరీంనగర్లో భారీ అగ్నిప్రమాదం.. గుడిసెలు దగ్ధం..

Fire Accident : కరీంనగర్లో భారీ అగ్నిప్రమాదం.. గుడిసెలు దగ్ధం..
X

కరీంనగర్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సుభాష్ నగర్లోని ఓ గుడిసెలో అకస్మాతుగా మంటలు చెలరేగాయి. మంటలు పక్కనే ఉన్న మరికొన్ని గుడిసెలకు అంటుకోవడంతో భారీ ప్రమాదం జరిగింది. మంటల ధాటికి 8 గ్యాస్ సిలిండర్లు పేలాయి. ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే గుడిసెల్లో ఉన్నవారంతా మేడారం వెళ్లడంతో ప్రాణనష్టం తప్పింది. దేవుడి దగ్గర పెట్టిన దీపం వల్ల మంటలు అంటుకున్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా వలస కార్మికులు గత కొన్నేళ్లుగా గుడిసెలు వేసుకుని అక్కడ నివాసం ఉంటున్నారు. వారంతా మేడారం జాతరకు వెళ్లడంతనట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Updated : 20 Feb 2024 12:05 PM IST
Tags:    
Next Story
Share it
Top