Telangana Excise Department : తెలంగాణ ఎక్సైజ్ శాఖలో భారీగా అధికారుల బదిలీలు
X
తెలంగాణ ఎక్సైజ్ శాఖలో భారీ సంఖ్యలో అధికారుల బదిలీలు జరిగాయి. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు అబ్కారీ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 14 మంది ఎక్సైజ్ సూపరింటెండెంట్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ౧౪౯ మంది ఎక్సైజ్ సీఐలను బదిలీ చేశారు. మల్టీజోన్ 1లో 64 మంది, మల్టీజోన్ 2లో 85 మంది ఎక్సైజ్ సీఐలను ట్రాన్స్ ఫర్ చేశారు.
మరోవైపు ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీరాజ్ శాఖ పరిధిలో సేవలందిస్తున్న 395 మంది ఎంపీడీవోలను ఇప్పటికే ప్రభుత్వం బదిలీ చేసింది. ఆదివారం డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లను బదిలీ చేసిన ప్రభుత్వం తాజాగా ఎంపీడీవోలను బదిలీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. సొంత జిల్లాల్లో పని చేస్తున్న వారితో పాటు మూడేళ్లకుపైగా ఒకే చోట విధులు నిర్వహిస్తున్న వారిని ఇతర జిల్లాలకు బదిలీ చేయాలని గతేడాది డిసెంబర్‌లో ఎన్నికల కమిషన్ ఆదేశించింది. మరో రెండు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో మరిన్ని శాఖల్లోనూ బదిలీలు జరిగే అవకాశముంది.