Home > తెలంగాణ > Mahalakshmi Scheme : మహాలక్ష్మి పథకానికి మెజార్టీ మహిళలు జై

Mahalakshmi Scheme : మహాలక్ష్మి పథకానికి మెజార్టీ మహిళలు జై

Mahalakshmi Scheme  : మహాలక్ష్మి పథకానికి మెజార్టీ మహిళలు జై
X

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్యారెంటీ హామీల పథకాల అమలు కోసం ప్రజా పాలన కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా దరఖాస్తులను స్వీకరించింది. డిసెంబర్ 28 నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం జనవరి 6 వరకు కొనసాగింది. ఇందులో భాగంగా… అర్హులైన వారి నుంచి భారీగా దరఖాస్తులు వచ్చాయి. మహాలక్ష్మి పథకానికి అత్యధికంగా వచ్చాయి. మహిళలకు నెలకు రూ.2500 ఇచ్చే ఈ స్కీమ్‌కి ఎక్కుమంది అప్లై చేసుకున్నారు. ఆ తర్వాత రూ.500కే గ్యాస్‌ సిలిండర్లకు, ఇందిరమ్మ ఇళ్లకు ఎక్కువ అప్లికేషన్లు అందాయి.

అభయహస్తం గ్యారంటీలతో పాటు మరిన్ని సంక్షేమ పథకాలకు అర్జీకి అవకాశం కల్పించగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,25,84,383 దరఖాస్తులు అందాయి. వాటిలో 1,09,00,662 దరఖాస్తులను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేశారు. ఆన్‌లైన్‌లో నమోదు ప్రక్రియ దాదాపు తుది దశకు చేరింది. జిల్లాల వారీగా అప్‌లోడ్‌ అయిన అప్లికేషన్లు పరిశీలిస్తే.. గ్రేటర్‌ హైదరాబాద్‌ నుంచి అత్యధికంగా 18.97 లక్షలు ఉన్నాయి. అతి తక్కువ జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా నుంచి 1.37 లక్షలు ఉన్నాయి. ఒక్కో దరఖాస్తు ఫారంలో తమ అర్హతలను బట్టి పలు పథకాలకు అభ్యర్థన పెట్టుకున్నారు. అలా పథకాలవారీగా విభజించి చూస్తే అందిన మొత్తం అభ్యర్థనల సంఖ్య 4,56,35,666 అవుతుంది.







Updated : 20 Jan 2024 8:45 AM IST
Tags:    
Next Story
Share it
Top