Congress: కాంగ్రెస్కు షాక్.. మెదక్ జిల్లా అధ్యక్షుడు రాజీనామా
X
మైనంపల్లి హన్మంతరావు చేరిక కాంగ్రెస్లో కాకా రేపింది. మెదక్ టికెట్ మైనంపల్లి రోహిత్కు ఇస్తారన్న ప్రచారంతో ఆ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి రాజీనామా చేశారు. గత పదేళ్లుగా పార్టీ కోసం కష్టపడితే తగిన గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు ఉన్నవారికే టికెట్లు ఇస్తున్నారని.. ప్రజాసేవ చేస్తున్నవారిని విస్మరిస్తున్నారని వాపోయారు.
కాంగ్రెస్ వ్యతిరేకులకే సీట్లు ఇస్తున్నారని తిరుపతిరెడ్డి ఫైర్ అయ్యారు. ‘‘డబ్బు సంచులు ఉన్న నాయకులకే సీట్లు దక్కే పరిస్థితి ఉంది. నోట్ల కట్టలకు అమ్ముడుపోయే వారు భవిష్యత్తులో తెలంగాణ ఆత్మగౌరవాన్ని నడిబజారులో నవ్వుల పాలు చేయడం ఖాయం. ఈ విషయంలో ఏఐసీసీ అధ్యక్షుడితో పాటు సోనియా, రాహుల్ గాంధీ సైతం మౌనం వహిచడం బాధ కలిగిస్తోంది. బరువెక్కిన హృదయంతో పార్టీని వీడుతున్నా. నా అనుచరులతో మాట్లాడి త్వరలోనే భవిష్యత్ నిర్ణయం ప్రకటిస్తా’’ అని తిరుపతిరెడ్డి చెప్పారు.