Medaram : జనసంద్రాన్ని తలపిస్తున్న మేడారం...వనదేవతల దర్శనానికి భక్తులు బారులు
X
ప్రపంచంలో అతి పెద్ద గిరిజన జాతరకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. మహాజాతర సమీపిస్తుడడంతో అమ్మవార్ల దర్శనానికి భక్తులు బారులు తీరారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి వనదేవతలకు కోడె మొక్కులు, బంగారం సమర్పిస్తున్నారు. ముందుగా జంపన్న వాగులో స్నానం ఆచరించి తలనీలాలు సమర్పించుకుంటున్నారు. గద్దెలపై అమ్మవార్లను దర్శించుకొని పులకించిపోతున్నారు. మహాజాతకు కొద్ది రోజులే ఉండడంతో అమ్మవార్లకు ముందస్తు మొక్కులు చెల్లించుకుంటున్నారు.
భక్తుల రద్దీతో మేడారం పరిసర ప్రాంతాలు కోలాహలంగా మారాయి. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలిరావడంతో ట్రాఫిక్ జామ్ అవుతోంది. కాగా భక్తులను ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. ఎక్కడికక్కడ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రత్యేక సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. అంతేగాక జాతర కోసం కొత్త ఏఐ టెక్నాలజీని వాడనున్నారు. భక్తుల కోసం ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేక ఎల్ఈడీ స్కీన్ల ద్వారా కార్యక్రమాలను ఎప్పటికప్పడు ప్రజలు వీక్షించేలా జాగ్రత్తలు తీసుకొనున్నారు.