Home > తెలంగాణ > చిన్నారి సేఫ్.. కిడ్నాపర్ సురేశ్ అరెస్ట్

చిన్నారి సేఫ్.. కిడ్నాపర్ సురేశ్ అరెస్ట్

చిన్నారి సేఫ్.. కిడ్నాపర్ సురేశ్ అరెస్ట్
X

మేడ్చల్‌లోని బాలిక కిడ్నాప్‌ కేసులో పోలీసులు కొద్ది గంటల్లోనే ఛేదించారు. . సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా కిడ్నాపర్ సురేష్ సహా చిన్నారిని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర గుర్తించారు. పాపను అమ్మే ప్రయత్నంలో.. వేరే ప్రాంతాలకు వెళ్లడానికి కిడ్నాపర్ ప్రయత్నిస్తుండగా.. పోలీసులు వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు.





బుధవారం రాత్రి మేడ్చల్ ఘట్ కేసర్ లోని ఈడబ్ల్యూఎస్ కాలనీలో చిన్నారి కిడ్నాప్ అయ్యింది. కిడ్నాప్ చేసిన తరువాత పాప ఏడవకుండా ఉండడానికి పాపకు చాక్లెట్ ఇచ్చి.. ఎత్తుకుని తీసుకువెళ్లినట్లుగా సీసీ టీవీ ఫుటేజ్ లో కనిపించింది. బాలిక కనిపించకుండా పోవడంతో బాలిక తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రత్యేకంగా బలగాలను రంగంలోకి దింపి పాప జాడ కోసం గాలింపు చేపట్టారు.





అదే సమయంలో సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా... అదే కాలనీకి చెందిన సురేశ్‌ అనే వ్యక్తి కృష్ణవేణిని తీసుకువెళ్లినట్లు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీలో కృష్ణవేణిని ఎత్తుకువెళ్లిన దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ క్రమంలోనే పలు బృందాలను ఏర్పాటు చేయడంతోపాటు నగర పరిధిలోని అన్ని పోలీస్ స్టేషనను అలర్ట్ చేశారు. పోలీసులతోపాటు.. సుమారు 500 మంది పాప కోసం గాలించారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలోనూ సిబ్బందిని అలెర్ట్‌ చేశారు. ఈ నేపథ్యంలోనే సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో నిందితుడిని రైల్వే పోలీసులు గుర్తించారు. అతని నుంచి బాలిక కృష్ణవేణిని సురక్షితంగా కాపాడారు. నిందితున్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ప్రస్తుతం బాలిక రైల్వే పోలీసులు సంరక్షణలో ఉన్నది. ఘటనకు సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.






Updated : 6 July 2023 1:47 PM IST
Tags:    
Next Story
Share it
Top