Home > తెలంగాణ > మల్కాజిగిరిపై మల్లన్న గురి.. పార్టీ ఆదేశం కోసం వెయిటింగ్

మల్కాజిగిరిపై మల్లన్న గురి.. పార్టీ ఆదేశం కోసం వెయిటింగ్

మల్కాజిగిరిపై మల్లన్న గురి.. పార్టీ ఆదేశం కోసం వెయిటింగ్
X

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అధిష్ఠానం ఆదేశిస్తే మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తానని చెప్పారు. గతంలో మల్కాజ్ గిరి ఎంపీగా పనిచేసిన అనుభవం తనకు ఉందని గుర్తు చేశారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఆయన కలిశారు. మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశం ఈ నెల 21న ఉంటుందని తెలిపారు. ఇప్పటికే పార్టీ అధిష్ఠానం ఎంపీ ఎన్నికలపై ప్రత్యేక ఫోకస్ పెట్టిందని.. ఇందులో భాగంగా నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్‌, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గాల్లో ఇటివల జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ భారీ మెజార్టీతో గెలిచిందని మల్లారెడ్డి అన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇదే తరహాలో బీఆర్‌ఎస్‌ గెలవడం ఖాయమన్నారు. తెలంగాణలో అత్యధిక పార్లమెంట్ స్థానాలను బీఆర్‌ఎస్‌ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాగా మల్కాజిగిరి నుంచి బరిలోకి దిగాలని బీఆర్ఎస్ లో చాలా మంది ఆశావాహులు సిద్ధంగా ఉన్నారు. వారందరినీ కాదని ఎమ్మెల్యే అయిన మల్లారెడ్డికి పార్టీ టికెట్ ఇస్తుందా అనేది వేచి చూడాలి.


Updated : 4 Jan 2024 3:19 PM GMT
Tags:    
Next Story
Share it
Top