Home > తెలంగాణ > మల్కాజ్గిరి బీఆర్ఎస్ అడ్డా.. కాంగ్రెస్కు ముందుంది ముసళ్ల పండగ : MallaReddy

మల్కాజ్గిరి బీఆర్ఎస్ అడ్డా.. కాంగ్రెస్కు ముందుంది ముసళ్ల పండగ : MallaReddy

మల్కాజ్గిరి బీఆర్ఎస్ అడ్డా.. కాంగ్రెస్కు ముందుంది ముసళ్ల పండగ : MallaReddy
X

అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ చరిత్ర సృష్టించిందని మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మల్కాజ్గిరి బీఆర్ఎస్ అడ్డా అన్న ఆయన.. ఏడింటికి ఏడు అసెంబ్లీ సీట్లు గెలిచామన్నారు. కేసీఆర్ వంటి నాయకుడు దేశంలో మరొకరు లేరని.. బీఆర్ఎస్ పార్టే తెలంగాణకు శ్రీరామరక్ష అని చెప్పారు. గెలిచి మూడు నెలలు కాకముందే కాంగ్రెస్ నేతలు ఎగిరెగిరి పడుతున్నారని.. వారికి ముందుంది ముసళ్ల పండగ అంటూ విమర్శించారు. 100 మీటర్ల లోతులో బీఆర్ఎస్ లేదని.. 1000 మీటర్ల లోతులో కాంగ్రెస్ ఉందని సీఎం రేవంత్ రెడ్డికి మల్లారెడ్డి కౌంటర్ ఇచ్చారు.

కేసీఆర్ సీఎంగా కానందుకు ప్రజలు బాధపడుతున్నారని మల్లారెడ్డి అన్నారు. కేసీఆర్ త్యాగాల ముందు ఈ ఓటమి చాలా చిన్నదన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అత్యధిక స్థానాలు గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో అసెంబ్లీలో వచ్చిన ఫలితాలే రిపీట్ అవుతాయని చెప్పారు. పార్టీ గెలుపు కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. కేటీఆర్ వల్లే హైదరాబాద్ గొప్ప సిటీగా మారిందని.. యువతకు 9లక్షల ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు.

మేడ్చల్ సహా పలు మున్సిపాలిటీల్లో అవిశ్వాస నోటీసులపై మల్లారెడ్డి స్పందించారు. అవిశ్వాస నోటీసుల వల్లే కౌన్సిలర్లతో కలిసి దుబాయ్, గోవా వెళ్లినట్లు చెప్పారు. ట్రిప్ కు తీసకెళ్లి అవిశ్వాసం ఇచ్చిన కౌన్సిలర్లను కూల్ చేస్తున్నట్లు చెప్పారు. అవిశ్వాసా తీర్మానాలు తమకు కొత్తేమి కాదన్నారు. కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్పై విమర్శలు మానుకొని అభివృద్ధిపై ఫోకస్ చేయాలని సూచించారు. కల్లబొల్లి కబుర్లు చెప్పి కాంగ్రెస్ కాలక్షేపం చేయడం తప్ప చేసేదేముండదని సెటైర్ వేశారు.

Updated : 21 Jan 2024 9:52 AM GMT
Tags:    
Next Story
Share it
Top