Home > తెలంగాణ > ఆ గొంతు ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది : చిరంజీవి

ఆ గొంతు ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది : చిరంజీవి

ఆ గొంతు ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది : చిరంజీవి
X

గద్దర్ అకాల మరణం అందరినీ శోకసంద్రంలోకి నెట్టింది. ఆయన మృతిపై రాజకీయ, సినీ ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. గద్దర్ మృతి తనను ఎంతో కలిచి వేసిందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఆయన మరణించినా.. ఆయన గొంతు ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటుందని ట్వీట్ చేశారు.

‘‘వారి గళం అజరామరం. ఏ పాట పాడినా, దానికో ప్రజా ప్రయోజనం ఉండేలా గొంతు ఎత్తి పోరాడిన ప్రజా గాయకుడు, 'ప్రజా యుద్ధ నౌక' గద్దరన్నకి లాల్ సలాం. సరళంగా ఉంటూనే అత్యంత ప్రభావవంతమైన తన మాటల పాటల తో దశాబ్దాల పాటు ప్రజల్లో స్ఫూర్తిని రగిల్చిన గద్దరన్న ఇక లేరు అనే వార్త తీవ్ర విషాదాన్ని కలుగజేసింది. ప్రజా సాహిత్యంలో, ప్రజా ఉద్యమాల్లో ఆయన లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిది. పాటల్లోనూ, పోరాటంలోనూ ఆ గొంతు ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. ఆయన కుటుంబసభ్యులకు అభిమానులకు, శ్రేయోభిలాషులకు నా ప్రగాడ సంతాపం’’ అని చిరు ట్వీట్ చేశారు.




Updated : 6 Aug 2023 6:55 PM IST
Tags:    
Next Story
Share it
Top