Home > తెలంగాణ > బిగ్ అలర్ట్.. రాష్ట్రంలో నేడు, రేపు భారీ వర్షాలు

బిగ్ అలర్ట్.. రాష్ట్రంలో నేడు, రేపు భారీ వర్షాలు

బిగ్ అలర్ట్.. రాష్ట్రంలో నేడు, రేపు భారీ వర్షాలు
X

వరుసగా ఐదు రోజులపాటు చినుకు ఆగకుండా కురిసిన వానలతో రాష్ట్రం తడిసి ముద్దయింది. అయితే ఈ వర్షాలు మరో రెండు రోజులు కొనసాగుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. నేడు, రేపు రాష్ట్రంలో భారీ వర్షాలు కురవనున్నాయని తెలిపింది. రానున్న 24 గంటల్లో మరో అల్పపీడనం ఏర్పడనుందని, దీని ప్రభావంతో 25,26 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇక ఈ నెల 25న ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్.26న సిరిసిల్ల, పెద్దపెల్లి, కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ, సూర్యపేట, మహబూబాబాద్, హనుమకొండ, వరంగల్, జనగాం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, వాతావరణ శాఖ ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

ఇక వ్యాప్తంగా కురుస్తున్న కుండపోత వర్షాలకు పల్లెలు, పట్టణాలు తడిసి ముద్దవుతున్నాయి. చెరువులు, వాగులు నిండిపోయి నీరు గ్రామాల్లోకి, రోడ్లమీదకు వచ్చి చేరుతోంది. దీంతో గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని చోట్ల వరద ఉద్ధృతికి రోడ్లు కోతకు గురయ్యాయి. ఎగువ నుంచి భారీగా నీరు వచ్చి చేరడంతో గోదావరిలో వరద ప్రవాహం పెరుగుతోంది.

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని పెన్‌ గంగా సహా వాగులు, ఒర్రెలు ఉద్ధృతంగా ప్రవహించడంతో జన జీవనం పూర్తిగా స్తంభించి పోయింది. ఉత్తర-దక్షిణ భారతాన్ని అనుసంధానం చేసే జైనథ్‌ మండలం డొల్లార వద్ద 50 అడుగుల ఎత్తుతో ఉన్న వంతెనను తాకుడూ పెన్‌గంగా పరవళ్లుతో అధికారయంత్రాంగం రాకపోకలు పూర్తిగా నిలిపివేసింది. అక్కడి ప్రజాప్రతినిధులు ముందస్తు చర్యల్లో భాగంగా ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను పంపించాలని ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు.


Updated : 23 July 2023 8:47 AM IST
Tags:    
Next Story
Share it
Top