Home > తెలంగాణ > CM Revanth Reddy : ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే మెట్రో పొడిగింపు...రేవంత్ రెడ్డి

CM Revanth Reddy : ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే మెట్రో పొడిగింపు...రేవంత్ రెడ్డి

CM Revanth Reddy  : ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే మెట్రో పొడిగింపు...రేవంత్ రెడ్డి
X

ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొనే మెట్రో పొడిగించామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ మేరకు గచ్చిబౌలిలో అగ్నిమాపక ప్రధాన కార్యాలయం ప్రారంభించారు. రూ. 17 కోట్ల వ్యయంతో అన్ని సాంకేతిక హంగులతో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేశారు. ఏ ప్రమాదం జరిగిన అందరి కంటే ముందుండేది ఫైర్ సిబ్బందే అన్నారు. ఫైర్ సిబ్బంది ప్రాణాలకు తెగించి ఇతరుల ప్రాణాలను కాపాడతారని కొనియాడారు. దేశంలోనే అతిపెద్ద 5 నగరాల్లో హైదరాబాద్ ఒకటని గుర్తు చేశారు. గడిచిన 30 ఏళ్లు గత పాలకుల కృషితో హైదరాబాద్ ఎదిగిందని తెలిపారు. గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ కు ఓఆర్ఆర్ వచ్చిందన్నారు. 345 కి.మీ దాదాపు 50 శాతం రోడ్డుకు సంబంధించి నిధులు పూర్తయ్యాయని చెప్పారు.

ఆర్ఆర్ఆర్ కు సంబంధించి అపోహలు వద్దన్నారు. త్వరలో రిజనల్ రింగ్ రోడ్డు వస్తుందని తెలిపారు. రాష్ట్రంలో 40 శాతం అర్బన్ ఏరియా ఉందని..సిటీతో పాటు అర్బన్ ఏరియాలను కూడా డెవెలప్ మెంట్ చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. చాలా ప్రాంతాలకు హైదరాబాద్ అనువైన నగరమని చెప్పారు. తెలంగాణకు 2050 మెగా మాస్టర్ ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ వరకు మధ్యలో ఉండే ప్రాంతం పెరీ అర్బన్ ప్రాంతమన్నారు.

ఫార్మాసిటీపై కొంతమంది పనిగట్టుకొని ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు కూతవేటు దూరంలో రెడ్ జోన్ ఉందని తెలిపారు. 25 వేల ఎకరాలను నూతన నగరంగా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రజా ప్రయోజనం కోసం నాగోల్ నుంచి ఎల్బీ నగర్ వరకు ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు మెట్రో పొడిగిస్తున్నట్లు తెలిపారు. 2 వేల నుంచి 3 వేల ఎకరాలకు ఫార్మా విలేజ్ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.

Updated : 18 Feb 2024 7:52 AM GMT
Tags:    
Next Story
Share it
Top