Mic TV Sammakka Sarakka song : యూట్యూబ్లో దూసుకెళ్తోన్న మైక్ టీవీ మేడారం సాంగ్
X
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయ పాటలకు మైక్ టీవీ పుట్టినిల్లు. తెలంగాణ సంస్కృతిని చాటిచెప్తూ మైక్ టీవీ ఇప్పటికే ఎన్నో పాటలను ప్రజల ముందుకు తెచ్చింది. తెలంగాణ అవిర్భావం, బోనాలు, బతుకమ్మ వంటి ప్రత్యేక పాటలతో తెలంగాణ గొప్పదనాన్ని ప్రపంచానికి చాటింది. ఏదైన పండుగ వచ్చిందంటే మైక్ టీవీ పాట కోసం ఎదురుచూస్తుంటారు. ఇక సమ్మక్క సారక్క జాతర సందర్భంగా మరో ప్రత్యేక పాటతో మైక్ టీవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
తెలంగాణ కుంభమేళగా పేరుగాంచిన సమక్క-సారక్క జాతరకు అంతా సిద్ధమైంది. ఫిబ్రవరి 21 నుంచి 24వరకు ఈ మహా జాతర జరగనుంది. దీనిని పురస్కరించుకుని మైక్ టీవీ అద్భుతమైన పాటను రూపొందించింది. ఈ పాటను మంత్రి సీతక్క విడుదల చేశారు. పాట బ్రహ్మాండంగా ఉందంటూ కితాబిచ్చారు. మైక్ టీవీ చైర్మన్ అప్పి రెడ్డి నిర్మించిన ఈ పాటకు కమల్ ఎస్లావత్ లిరిక్స్, మదీన్ ఎస్కే సంగీతం అందించారు. వాగ్దేవి, స్పూర్తి జితేందర్లు ఆలపించగా.. నాగ దుర్గ తన డ్యాన్స్తో అదరగొట్టింది. ప్రస్తుతం యూట్యూబ్లో ఈ పాట దూసుకెళ్తోంది.