Home > తెలంగాణ > శేజల్, దుర్గం చిన్నయ్య అనుచరుల మధ్య అర్ధరాత్రి గొడవ

శేజల్, దుర్గం చిన్నయ్య అనుచరుల మధ్య అర్ధరాత్రి గొడవ

శేజల్, దుర్గం చిన్నయ్య అనుచరుల మధ్య అర్ధరాత్రి గొడవ
X

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆరిజిన్ డెయిరీ సీఈఓ శేజల్, మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యల గొడవ మరోసారి రోడ్డుపైకి వచ్చింది. శేజల్, చిన్నయ్య అనుచరుల మధ్య సోమవారం అర్ధరాత్రి గొడవ జరిగింది. బెల్లంపల్లి రూరల్ సీఐ రాజ్ కుమార్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా తాళ్ల గురిజాల పోలీస్ స్టేషన సమీపంలో ఈ గొడవ జరిగింది. దుర్గం చిన్నయ్య ఇంటికి వెళ్లి.. శేజల్, ఆదినారాయణ గొడవ చేశారు. చిన్నయ్యను కులంపేరుతో దూషిస్తూ రచ్చ చేశారు. ఇంతలో చిన్నయ్య అనుచరులు బీమా శంకర్ సహా మరో ఇద్దరు వారికి అడ్డుపడ్డారు. ఈ క్రమంలో వారిపై కూడా శేజల్, ఆదినారాయణలు గొడవకు దిగారు. దీంతో గొడవ పెద్దదై.. ఒకరినొకరు కొట్టుకున్నారు.

ఈ ఘర్షణలో శేజల్ కారు అద్దాలు ధ్వసం అయ్యాయి. అనంతరం ఒకరిపై మరొకరు తాళ్ల గురిజాల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు ఇరు వర్గాలపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. దుర్గం చిన్నయ్య అనుచరుల మీద 307, 427, r/w 34 IPC కేసులు నమోదు చేయగా.. శేజల్, ఆదినారాయణలపై 307 IPC SC/ST చట్టం క్రింద కింద కేసు నమోదు చేశారు. ఈ కేసుపై విచారణ చేస్తున్నామని సీఐ రాజ్ కుమార్ తెలిపారు.


Updated : 26 Dec 2023 8:11 PM IST
Tags:    
Next Story
Share it
Top