Home > తెలంగాణ > కేసీఆర్ను తక్కువ అంచనా వేయొద్దు : ఓవైసీ

కేసీఆర్ను తక్కువ అంచనా వేయొద్దు : ఓవైసీ

కేసీఆర్ను తక్కువ అంచనా వేయొద్దు : ఓవైసీ
X

సీఎం కేసీఆర్పై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ను తక్కువ అంచనా వేయొద్దని సూచించారు. రాహుల్ గాంధీ, మమతా బెనర్జీలను ప్రధాని అభ్యర్థులుగా ప్రొజెక్ట్ చేయడంపై అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా స్పందించారు. కేసీఆర్ సామర్థ్యాన్ని, దూరదృష్టిని, రాజకీయ చతురతను తక్కువగా చూడొద్దన్నారు. కేసీఆర్ సర్కార్ ఏ మంచి పనిచేసినా.. తమ మద్ధతు ఉంటుందని స్పష్టం చేశారు.

కేసీఆర్ అధికారంలోకి రాకముందు తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా జరిగాయనీ.. కానీ ఇప్పుడు ఆ పరిస్ధితి లేదని ఓవైసీ అన్నారు. రైతుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కొత్త సెక్రటేరియట్ నిర్మాణం సందర్భంగా కూల్చివేసిన మసీదును పునర్నిర్మించినందుకు కేసీఆర్ను ఓవైసీ ప్రశంసించారు. దేశంలో ఒక ప్రభుత్వం మసీదును కూల్చివేసి పునర్నిర్మించిన ఘటన ఇప్పటివరకు ఉంటే తనకు చూపెట్టాలన్నారు. ముస్లింల అభ్యున్నతికి కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని చెప్పారు.

దేశానికి బీజేపీ, కాంగ్రెస్‌లు లేకుండా మూడో ప్రత్యామ్నాయం అవసరముంద‌ని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఇండియా కూటమి మూడో ప్రత్యామ్నాయం కాదన్నారు. థర్డ్ ఫ్రంట్ వచ్చినప్పుడే దేశానికి మరింద మంచి జరుగుతుందన్నారు. ఎంఐఎం ఇండియా కూటమికి మద్ధతు ఇవ్వదని స్పష్టం చేశారు. ఇక తెలంగాణలోనూ బీఆర్ఎస్పై ఎంఐఎం పోటీ చేస్తుందన్నారు.

Updated : 27 Aug 2023 2:05 PM IST
Tags:    
Next Story
Share it
Top