మహిళా రిజర్వేషన్ల బిల్లును మేం వ్యతిరేకిస్తున్నాం.. ఒవైసీ
X
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించడానికి కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. తమ మతస్తులకు న్యాయం చేయని ఈ బిల్లు దండగ అన్నారు. ‘‘ముస్లిం మహిళలకు కోటా ఇవ్వకుండా బిల్లు తెస్తున్నారు. మా మహిళలకు ప్రాతినిధ్యంపై ఈ బిల్లులో ఎలాంటి ప్రస్తావనా లేదు..’’ అని అన్నారు. బిల్లుపై మంగళవారం లోక్‌సభలో జరిగిన చర్చలో ఒవైసీ మాట్లాడారు. ‘‘చట్టసభలో ప్రాతినిధ్యం లేనివారికి రిజర్వేషన్ కల్పించాలి. ముస్లిం మహిళలకు ప్రాతినిధ్యం లేదు కనుక వారికి కోటా ఇవ్వాలి. ఆ అంశం లేని ఈ బిల్లుల లోపభూయిష్టం. మేం దీన్ని వ్యతిరేకిస్తాం’’ అని స్పష్టం చేశారు.
కాగా, మహిళలకు 33 శాతం అని చెప్పిన కేంద్రం ఆయా సామాజిక వర్గాల్లోని మహిళలకు న్యాయం చేకూరేలా చూడాలని పలు పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. కులాల ఆధారంగానూ కోటా ఉండాలని, లేకపోతే అగ్రవర్ణాల మహిళలే 33 శాతం సీట్లను కాజేస్తారని దళిత, బీసీ సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.